గతంలో జీవితం రాజశేఖర్ లు చేసిన కొన్ని వ్యాఖ్యలు వాళ్ళని ఇప్పుడు జైలు పాలుచేసింది. కాంట్రవర్సీలకి కేరాఫ్ గా ఉండే జీవిత రాజశేఖర్ లు మెగాస్టార్ చిరంజీవిపై అలాగే చిరంజీవి బ్లడ్ బ్యాంకు పై అనుచిత వ్యాఖ్యలు చెయ్యగా అప్పట్లో మెగా ఫాన్స్ రాజశేఖర్ దంపతులు కారుపై దాడి కూడా చేసారంటూ వారు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. తర్వాత మెగాస్టార్ తో తమకి ఎలాంటి గొడవలు లేవంటూ చెప్పుకున్నారు. అయితే చిరంజీవి బ్లడ్‌బ్యాంక్ ద్వారా సేకరించిన రక్తాన్ని మార్కెట్లో అమ్ముకుంటున్నారని 2011లో జీవిత, రాజశేఖర్ ఆరోపించారు. రాజశేఖర్ దంపతులు చేసిన వ్యాఖ్యలపై అల్లు అరవింద్ అప్పట్లోనే వారిపై పరువు నష్టం కేసు వేశారు.
మెగాస్టార్ చిరంజీవి పేరుతో నడుస్తున్న సేవా కార్యక్రమాలపైన రాజశేఖర్ దంపతులు అసత్య ఆరోపణలు చేశారంటూ పరువునష్టం దావా కేసు వేశారు. వారు చేసిన ఆరోపణలకు సబంధించిన వీడియోతో పాటు.. మీడియాలో వచ్చిన కథనాలను కూడా జత చేసి కోర్టుకు సమర్పించారు. అప్పటినుండి కోర్టులో ఉన్న ఈ కేసుపై నిన్న మంగళవారం నాంపల్లి కోర్టు తుది తీర్పుని వెలువరించింది. ఆ తీర్పులో భాగంగా జీవిత రాజశేఖర్ దంపతులకి కోర్టు ఓ ఏడాది జైలు శిక్ష విధించడంతో పాటుగా 5 వేలు జరిమానా విధించారు.
అయితే రాజశేఖర్ లాయర్ జరిమానా చెల్లించడంతో.. ఈ తీర్పుపై జిల్లా కోర్టును ఆశ్రయించే అవకాశం కల్పించడంతో పాటుగా పై కోర్టులో అప్పీలుకు అవకాశమిస్తూ రాజశేఖర్ దంపతులకి బెయిలు మంజూరు చేసింది కోర్టు.