Advertisement
Google Ads BL

కొన్నిటికి మైనస్ అయితే.. కొన్నిటికి అదే ప్లస్


ఇప్పుడు టాలీవుడ్ లో నయా ట్రెండ్ మొదలైంది. అదేమిటంటే సినిమాల విడుదలకు ముందే పెయిడ్ ప్రీమియర్స్ అంటూ మొదలు పెట్టారు. గతంలోనూ ఇలాంటి పెయిడ్ ప్రీమియర్స్ వేసినా.. మధ్యలో ఆపేసారు. అయితే ఈ ప్రీమియర్స్ అనేవి కొన్నిటికి మైనస్ అయితే.. అదే ప్రీమియర్స్ కొన్నిటికి హెల్ప్ అయ్యాయి. రైటర్ పద్మభూషణ్ లాంటి మూవీ కి ఈ ప్రీమియర్స్ బాగా హెల్ప్ అయ్యాయి. ఇక సమంత శాకుంతలం మూవీకి ఈ ప్రీమియర్స్ మైనస్ అయ్యాయి. ముందు నుండే ప్రీమియర్స్ అంటూ హంగామా చెయ్యడంతో.. సినిమా చూసొచ్చిన వారు సినిమా బాలేదంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టెయ్యడంతో శకుంతలానికి ఓపెనింగ్స్ లేకుండా పోయాయి.

Advertisement
CJ Advs

అదే పెయిడ్ ప్రీమియర్స్ రీసెంట్ గా శ్రీ విష్ణు సామజవరగమనకి బాగా హెల్ప్ అయ్యాయి. శ్రీవిష్ణు నటించిన ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారు మూడు రోజుల ముందు నుండే ప్రీమియర్స్ అంటూ చేసిన హడావిడి.. ఆ సినిమాకి బాగా కలిసొచ్చింది. సినిమా బావుంది అంటూ మౌత్ టాక్ సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయ్యింది. దానితో సామజవరగమన మూవీ బాక్సాఫీసు వద్ద కాసులు వర్షం కురిపించింది. కంటెంట్ ని నమ్మి మేకర్స్ ఇలా చేస్తున్నారు. గతంలో హైదరాబాద్ లోనే ఇలా ప్రీమియర్స్ ట్రెండ్ నడిచేది. 

కానీ ఇప్పుడు హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, తిరుపతి లాంటి నగరాలకు స్ప్రెడ్ అయిన ఈ ప్రీమియర్స్ ట్రెండ్ ఇప్పుడు జులై 21 న విడుదల కాబోతున్న హిడింబ మూవీని తాకింది. హిడింబ మూవీ టీం కూడా స్పెషల్ ప్రీమియర్స్ అంటూ హడావిడి మొదలెట్టారు. AK ఎంటర్టైన్మెంట్ వారు అశ్విన్ బాబు నటించిన హిడింబ మూవీని విజయవాడ, వైజాగ్, కాకినాడ, ఏలూరు, గుంటూరు, నెల్లూరు లలో ప్రీమియర్స్ ప్రదర్శిస్తున్నారు. అయితే సినిమా టాక్ బావుంటే ఈ ప్రీమియర్స్ ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి. కానీ టాక్ తేడా కొడితే అసలుకే మోసం వస్తుంది. 

The latest action thriller getting ready for paid premieres:

Early Premiere Trends Comes To The Hidimba
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs