Advertisement
Google Ads BL

సినిమాలకి బ్రేక్ ఇవ్వబోతున్న మెగా హీరో


బాక్సాఫీసు దగ్గర మెగా హీరోల జాతర మొదలు కాబోతుంది. నెలపాటు మెగా హీరోల సినిమాలు బాక్సాఫీసుని షేకాడించడానికి రెడీ అవుతున్నాయి. అందులో ముందుగా పవన్ కళ్యాణ్ తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి జులై 28 న BRO తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. పవన్ కళ్యాణ్ డబ్బింగ్ పూర్తి చేస్తే BRO కి సంబందించి పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం పూర్తవుతుంది. ఇక ఈ రోజునుండి BRO కి కౌన్ డౌన్ మొలైనట్టుగా పోస్టర్ వేసి ప్రకటించారు మేకర్స్. ఇప్పటికే సాయి ధరమ్ తేజ్. హీరోయిన్ కేతిక తో కలిసి BRO ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు

Advertisement
CJ Advs

అయితే ఈ ఏడాది విరూపాక్షతో బిగ్గెట్స్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సాయి ధరమ్ తేజ్ BRO ద అవతార్ తర్వాత సంపత్ నందితో ఒక ప్రాజెక్ట్ చెయ్యబోతున్నాడు. బ్రో ప్రమోషన్స్ లో ఇదే విషయాన్ని కన్ ఫర్మ్ చేసిన సాయి ధరమ్ తేజ్.. ఈ ప్రాజెక్ట్ ని మొదలు పెట్టే ముందు ఆరు నెలలు సినిమాలకి, షూటింగ్స్ కి బ్రేక్ ఇవ్వలని అనుకుంటున్నాడట, తన శారీరక ఆరోగ్యంపై దృష్టి పెట్టడానికి ఆరు నెలల విరామం తీసుకుంటానని చెప్పాడు.

ఇకపై చెయ్యబోయే సినిమాల కోసం తన 100 శాతం బెస్ట్ ఇవ్వాలనుకుంటున్నట్లుగా చెప్పిన సాయి ధరమ్ తేజ్.. ప్రేక్షకుల నుండి తనపై ఎటువంటి ఫిర్యాదులు ఉండకూడదు. చిన్న సర్జరీ చేయించుకోవాలి, ఆ తర్వాత నేను బలంగా తిరిగి వస్తాను. నేను పూర్తిగా కోలుకోవడానికి దాదాపు ఆరు నెలల సమయం పట్టవచ్చు అని సాయి ధరమ్ తేజ్ అన్నాడు. 

గతంలో సాయి ధరమ్ ఓ రోడ్ యాక్సిడెంట్ కి గురై కొన్నాళ్లు ఆరోగ్యపరంగా సఫర్ అయ్యాడు. ఆల్మోస్ట్ అతని ప్రాణాలు మీదకి తెచ్చుకున్నాడు. ఆ యాక్సిడెంట్ నుండి కోలుకోవడానికి సాయి ధరమ్ కి చాలా నెలల సమయమే పట్టింది.

Mega hero to take a break from films:

Sai Dharam Tej to take a six months break from films
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs