Advertisement
Google Ads BL

ప్రాజెక్ట్ K నుంచి దీపికా పదుకొణె లుక్


వైజయంతీ మూవీస్ సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్ట్ K నుంచి దీపికా పదుకొణె అఫీషియల్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు మేకర్స్. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే భారీ సంచలనాల్ని నెలకొల్పి ప్రపంచ వ్యాప్తంగా ఎదురుచూస్తున్న భారతీయ చిత్రంగా నిలిచింది.

Advertisement
CJ Advs

శాన్ డియాగో కామిక్-కాన్‌లోని ఐకానిక్ హెచ్ హాల్‌లో గ్రాండ్ లాంచ్ అవుతున్న ప్రాజెక్ట్ K లో ఇండస్ట్రీలోని బిగ్గెస్ట్ స్టార్స్ ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటాని నటిస్తున్నారు. ఈ మల్టీలింగ్వల్ మూవీ గ్రౌండ్ బ్రేకింగ్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ని అందించే భరోసా ఇస్తూ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకర్షిస్తోంది.

ప్రాజెక్ట్ కె నుంచి దీపికా పదుకొణె అఫీషియల్ ఫస్ట్ లుక్ అభిమానులను ఆశ్చర్యపరిచింది. సెపియా-టోన్డ్ విజువల్‌లో ఆమె ఇంటెన్స్ ఓరతో ఆకట్టుకుంది. ఈ ఫస్ట్ లుక్ సినిమా కథనంలో ఉన్న రహస్యాలను తెలుసుకోవాలనే ఆసక్తిని వ్యూవర్స్ లో కలిగిస్తుంది.

దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ Kని అద్భుతంగా రూపొందించి సైన్స్ ఫిక్షన్ గ్రిప్పింగ్ డ్రామాతో కలిసే ప్రపంచానికి ప్రేక్షకులను తీసుకెళ్లారు. భారీ తారాగణం, బ్రెత్ టేకింగ్ విజువల్స్, సరిహద్దులను అధిగమించే స్క్రిప్ట్‌తో రూపొందుతున్న ప్రాజెక్ట్  K.. రిలీజ్ కోసం అత్యధికంగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటిగా నిలిచింది.

జనవరి12, 2024న థియేటర్లలో విడుదల కానున్న ప్రాజెక్ట్ K ఇండియన్ సినిమాలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి, సైన్స్ ఫిక్షన్ జోనర్ ని రీడిఫైన్ చేయడానికి సిద్ధంగా ఉంది. అభిమానులు రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, దీపికా పదుకొణె అఫీషియల్ ఫస్ట్‌లుక్‌ వారు ఎదురుచూస్తున్న స్పెల్ బైండింగ్ సినిమాటిక్ యూనివర్స్ లో ఒక అద్భుతమైన గ్లింప్స్ లా ఆకట్టుకుంది.

Deepika Padukone first look from Project K:

Deepika Padukone looks unmissable in her official first look from Project K
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs