Advertisement
Google Ads BL

తాప్సి అన్నది ఇలియానా నేనా?


హీరోయిన్ తాప్సి సౌత్ ని పక్కనబెట్టి నార్త్ లో సెటిల్ అయ్యింది. మధ్య మధ్యలో సౌత్ సినిమాలు చేస్తున్నా ఎక్కువగా బాలీవుడ్ మీదే ఫోకస్ పెట్టింది. అక్కడే బాయ్ ఫ్రెండ్ ని కూడా మెయింటింగ్ చేస్తూ గ్లామర్ షో కి తెర లేపింది. అయితే ఈమధ్యన బాలీవుడ్ లో కూడా అవకాశాలు తగ్గేసరికి.. అక్కడ దర్శకనిర్మాతలు కొంతమందికే ఆఫర్స్ ఇస్తారు.. నటనని చూసి అవకాశం ఇవ్వరు, బయటి వాళ్లని ఎదగనివ్వరు అంటూ కామెంట్స్ చేసింది. తాజాగా తాప్సి పన్ను అభిమానులతో చిట్ చాట్ చేసింది. అయితే అభిమానులు ఆమెని వృత్తిపరమైన ప్రశ్నలతో పాటుగా.. పెళ్ళెప్పుడు చేసుకుంటావని అడిగారు.

Advertisement
CJ Advs

దానికి తాప్సి కాస్త సెటేరికల్ గా స్పందిస్తూ.. నేను పెళ్లెప్పుడు చేసుకుంటాను అని అడుగుతున్నారు. నేనింకా గర్భవతిని కాలేదు. కాబట్టి ఇప్పట్లో నా పెళ్లి ఉండకపోవొచ్చు. అలాంటిదేదైనా జరిగితే అందరికి చెబుతానంటూ వెటకారంగా చెప్పింది. అంటే ఇలియానా పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అవడంతో ఆమెని అందరూ పెళ్లెప్పుడు చేసుకున్నావ్, అసలు చేసుకున్నావా, లేదా అంటూ అడుగుతూన్నారు. రీసెంట్ గానే ఇలియానా తన బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేసింది. లేదంటే ఇలియానా ఎలా ప్రెగ్నెంట్ అయ్యిందో తెలియక అందరూ తెగ మాట్లాడేసుకున్నారు.

ఇప్పుడు తాప్సి కూడా ఇదే విషయాన్ని ఇండైరెక్ట్ గా మాట్లాడింది.. ఇలియానాపై ఇలాంటి కామెంట్స్ చేసి ఉంటుంది అంటూ గుసగుసలాడుకుంటున్నారు.

Taapsee indirect comments on Ileana?:

Fan asks Taapsee Pannu about her marriage
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs