టాలీవుడ్ టాప్ దర్శకుల్లో ఒకరైన త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం మహేష్ బాబు తో గుంటూరు కారం సెట్స్ మీదున్నారు. గుంటూరు కారం షూటింగ్ తో పాటుగా ఈ మధ్యనే ఆయన అల్లు అర్జున్ తో ప్యాన్ ఇండియా మూవీని ప్రకటించారు. ఈ చిత్రం అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతుంది. అయితే త్రివిక్రమ్ మహేష్ గుంటూరు కారంతో పాటుగా.. పవన్ కళ్యాణ్ రీమేక్ చిత్రాలకి మాటలను, మార్పులు లాంటివి అందిస్తూ ఉంటారు. వకీల్ సాబ్, భీమ్లా నాయక్, తాజాగా BRO ద అవతార్ కి కూడా త్రివిక్రమ్ డైలాగ్స్, అలాగే మార్పులు చేర్పులు చేసారు.
మలయాళం, తమిళం, హిందీ ఒరిజినల్ చిత్రాలని తీసుకుని అది పవన్ కళ్యాణ్ స్టయిల్ కి, ఆయన క్రేజ్ కి సరిపోయేలా మార్పులు చేర్పులు చేసి.. దానికి డైలాగ్స్ కూడా త్రివిక్రమ్ అందిస్తూ వేరే దర్శకులతో సినిమాలు చేయిస్తున్నారు. పవన్ కళ్యాణ్ రీమేక్స్ ఒప్పుకోవడం వెనుక త్రివిక్రమ్ ఉన్నారనేది అందరికి తెలిసిన విషయమే. అందుకే ఆ సినిమాల టైటిల్ కార్డ్స్ లో త్రివిక్రమ్ పేరు స్పెషల్ గా వేస్తున్నారు.
తాజాగా త్రివిక్రమ్ డైలాగ్స్, మార్పులు చేసిన BRO ద అవతార్ జులై 28 న విడుదలకు సిద్ధమవుతుండగా.. ఈ చిత్రానికి డైలాగ్స్ అందించినందుకు తివిక్రమ్ కి మేకర్స్ 20 కోట్లు ముట్టజెప్పారనే న్యూస్ వైరల్ గా మారింది. మాటల రచయితగా చాలా కాస్ట్లీ అయిన త్రివిక్రమ్ ఇప్పుడు BRO కోసం పని చేసినందుకు ఆయన 20 కోట్ల పారితోషకం అందుకోవడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.