ప్రాజెక్ట్ K సినిమా ప్రభాస్-దీపికా పదుకొనే-అమితాబచ్చన్ చెప్పుకోవడానికి గొప్పగా ఉంటుంది. రీసెంట్ గా కమల్ హాసన్ వచ్చి జాయిన్ అయ్యారు. ఇప్పుడిది చాలా పెద్ద ప్రాజెక్ట్ అయ్యిపోయింది అనుకుంటున్నాం కానీ బి హైండ్ ద స్క్రీన్ ప్రభాస్-నాగ్ అశ్విన్ వీళ్ళు పైకి కనిపించే పేర్లు అయితే.. పైకి కనిపించని పేరు సింగీతం శ్రీనివాసరావు. నాగ్ అశ్విన్ చాలా తెలివిగా ఏరి కోరి ఎంచుకుని తెచ్చుకుని పెట్టుకున్న దర్శకత్వపు మార్గదర్శకుడు సింగీతం శ్రీనివాస రావు .
మాయాబజార్ కి దర్శకత్వపు శాఖలో పని చేసిన వ్యక్తి భైరవ ద్వీపం, పుష్పక్, ఆదిత్య 369, విచిత్ర సోదరులు ఇలా ఎన్నో ప్రయోగాలు చేసిన ఉద్దండ దర్శకుడు ఆయన్ని తెచ్చి పెట్టుకోవడం వలన ఈ ప్రాజెక్ట్ పై క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. కమల్ హాసన్ ఈ ప్రాజెక్ట్ లోకి రావడానికి ముఖ్యమైన కారణం కూడా సింగీతం శ్రీనివాసరావు అని తెలుస్తోంది. ఆయన కమల్ తో మాట్లాడి ఒప్పించి ఈ ప్రాజెక్ట్ లో భాగమయ్యేలా చేసారు. కమల్ తో పలు హిట్ ప్రాజెక్ట్స్ చెయ్యడంతో సింగీతం ప్రపోజల్ ని కమల్ వేంటనే యాక్సెప్ట్ చేసారని సమాచారం.
సింగీతం దిశా నిర్దేశకత్వంలో సలహాలు, సూచనల మేరకు ప్రాజెక్ట్ K తెరకెక్కుతుంది. ప్రాజెక్ట్ K కోసం నాగ్ అశ్విన్ కట్ చేసిన గ్లింప్స్ చూసి సింగీతం శ్రీనివాసరావు గారు నా 66 ఇయర్స్ సినిమా ఇండస్ట్రీ కెరీర్ లో ఇలాంటిది చూడలేదయ్యా.. ఇదో అద్భుతం అంతే.. అని చెప్పి ఎగ్జైట్ అవుతూ ప్రాజెక్ట్ K టీమ్ ని అప్రిషేట్ చేసారు. అది జులై 20న కామికన్ స్టేజ్ పై రివీల్ కాబోతుంది. ఎంత ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నా అది మరింతగా పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు.