పవన్ కళ్యాణ్ డబ్బింగ్ కోసం వెయిట్ చేస్తున్న BRO యూనిట్ కి సంచారమందింది. నేడు సోమవారం ఉదయం ఆయన మంగళగిరి నుండి గన్నవరం ఎయిర్ పోర్ట్ కి వెళ్లి అక్కడినుండి తిరుపతికి బయలుదేరి వెళ్లారు. జనసేన కార్యకర్తపై సీఐ అంజుయాదవ్ చెయ్యి చేసుకున్న వ్యవహారంపై తిరుపతి ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు ఆయన అక్కడికి వెళ్లారు. రేణిగుంట ఎయిర్ పోర్ట్ నుండి భారీ ర్యాలీతో ఆయన తిరుపతి ఎస్పీ ఆఫీస్ కి చేరుకొని అంజు యాదవ్ పై చర్యలు తీసుకోవాలంటూ వినతి పత్రం సమర్పించిన విషయం తెలిసిందే.
తిరుపతి పర్యటన నుండి హైదరాబాద్ కి చెరుకోకున్నాక పవన్ కళ్యాణ్ బ్రో మూవీకి సంబందించిన డబ్బింగ్ కోసం ఒకరోజు సమయం కేటాయించబోతున్నారు. బ్రో డబ్బింగ్ ని ఆయన ఒకే ఒక్క రోజులో కంప్లీట్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. కాల చక్రాన్ని గిరా గిరా తిప్పే టైమ్ గాడ్.. ఇన్ టైమ్ లో డబ్బింగ్ కంప్లీట్ చెయ్యడంలో వింతేముంది.. చేసెయ్యగలరులెండి. ఈమధ్య వాక్సుద్ధి బాగా పెరిగింది.. వాక్చాతుర్యం బాగా పెంచుకున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ బ్రో డబ్బింగ్ ఒక్కరోజులో చుట్టెయ్యడం పెద్ద విషయమేమి కాదు.
అలాగే ఈనెల 25 న జరగబోయే బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఆ రోజు సాయంత్రం పవన్ కళ్యాణ్ టైమ్ కేటాయించారు. ఈమేరకు పక్కాగా అందిన సమాచారం ప్రకారం నిర్మాతలు ఆ ఏర్పాట్లలో ఉన్నారు.