ఎన్టీఆర్-కొరటాల శివ కలయికలో మార్చ్ లో మొదలైన దేవర షూటింగ్ పై రోజుకో న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉండడంతో ఎన్టీఆర్ ఫాన్స్ ఉబితబ్బిబ్బైపోతున్నారు. షూటింగ్ మొదలు పెట్టిన మూడున్నర నెలల్లో ఐదు భారీ షెడ్యూల్స్ కంప్లీట్ అవడం ఈరోజుల్లో సామాన్యమైన విషయం కాదు. ఎన్టీఆర్ అలాగే కీలక నటులంతా కొరటాలకు అందుబాటులో ఉండడంతో ఇలా షూటింగ్ స్పీడుగా జరగడానికి కారణమైంది. తాజాగా DOP రత్నవేలు దేవరపై కిక్కిచ్చే అప్ డేట్ ఇచ్చారు.
వెన్నెలతో ప్రకాశవంతంగా ఉన్న సముద్రంపై భయంకరమైన, రక్తదారతో కూడిన యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేశాము అంటూ పోస్ట్ చేసిన పిక్ క్షణాల్లో వైరల్ గా మారిపోయింది. రత్నవేలు ఎప్పటికప్పుడు అంటే దేవరకి సంబందించిన ఏ షెడ్యూల్ కంప్లీట్ అయినా.. దేవరపై ట్వీట్ వెయ్యడం చూస్తున్నాము.
దేవర ఐదు షెడ్యూల్స్ లో ఎన్నో ఫైట్ సీక్వెన్స్‌లతో పాటు కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. తాజాగా జరిగిన యాక్షన్ సీక్వెన్స్ దేవర సినిమాలో హీరో ఇంట్లో జరిగే ఫైట్ సీక్వెన్స్ అంటూ ఓ న్యూస్ లీకైంది. దేవర లో యాక్షన్ ఘట్టాలు మెయిన్ హైలైట్స్ గా నిలుస్తాయని తెలుస్తుంది. అలాగే జాన్వీ కపూర్ చిన్ననాటి పాత్రలో అల్లు అర్హ నటిస్తుంది అనే న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా స్ప్రెడ్ అయ్యింది.