Advertisement
Google Ads BL

గుంటూరు కారం సీక్రెట్ రివీల్ చేసేసింది


మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబోలో హ్యాట్రిక్ మూవీగా మొదలైన గుంటూరు కారం షూటింగ్ మొదలైనప్పటినుండే ఎన్నో మలుపులు, ఎన్నో రూమర్స్, ఎన్నో రకాల కన్ఫ్యూజన్స్ తర్వాత ఇప్పుడు షూటింగ్ ఫుల్ స్వింగ్ లో నడుస్తుంది. గుంటూరు కారంలో జరిగిన భారీ మార్పుల్లో ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ నుండి పూజాహెగ్డే ని తప్పించి.. ఆ స్థానంలోకి ఖిలాడీ, హిట్ 2 భామ మీనాక్షి చౌదరిని తీసుకోవడం. అయితే విషయమై మేకర్స్ నుండి ఎలాంటి ప్రకటన లేకపోయినా.. మీనాక్షి చౌదరి గుంటూరు కారం షూట్ లోకి జాయిన్ అయ్యింది అని సమాచారం ఉంది.

Advertisement
CJ Advs

అయితే గుంటూరు కారంలో మీనాక్షి చౌదరి భాగమయినట్లుగా దాచిన సీక్రెట్ ని ఆమె ఓ ఈవెంట్ లో రివీల్ చెయ్యడం చర్చనీయాంశం అయ్యింది. మీనాక్షికి చౌదరి కోలీవుడ్ లో నటించిన హత్య మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ మీనాక్షి చౌదరి హత్య మూవీ గురించి చెప్పడం అటుంచి ఆమె గుంటూరు కారంలో నటిస్తున్న సీక్రెట్ ని రివీల్ చేసేసింది. మహేష్ బాబు తో మొదటి రోజు షూటింగ్ చేసినప్పుడు చాలా ఎగ్జైట్ అయినట్లుగా చెప్పింది. తాను మహేష్ బాబు కి పెద్ద అభిమానిని అని.. గుంటూరు కారంలో తనకి అవకాశం రావడం నిజంగా తన అదృష్టమని చెప్పింది.

మహేష్-తివిక్రమ్ లతో ఎప్పటినుండో నటించాలనేది నా కల. అది ఇప్పటికి నెరవేరుతుంది. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తయ్యింది. మహెష్ తో మొదటి సీన్ చిత్రీకరణ నా జీవితంలో ఎప్పటికి మర్చిపోలేను అంటూ మీనాక్షి చౌదరి తెగ ఎగ్జైట్ అవుతూ హత్య ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మేకర్స్ గుట్టుగా దాచిన గుంటూరు కారం సీక్రెట్స్ రివీల్ చేసేసింది. 

Meenakshi confirms her role in Guntur Kaaram:

Meenakshi Chaudhary says she is act in Guntur Karam
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs