Advertisement
Google Ads BL

ఫైనల్లీ బాయ్ ఫ్రెండ్ ని చూపించిన ఇలియానా


గోవా బ్యూటీ సినిమాలకి దూరమైనా సోషల్ మీడియాకి దగ్గరగానే ఉంటుంది. ఆస్ట్రేలియా ఫోటో గ్రాఫర్ ఆండ్రు తో స్నేహం, రిలేషన్ షిప్ అన్ని బ్రేకప్ అవడంతో హెల్త్ పరంగా సమస్యలు, డిప్రెషన్ కి లోనైన ఇలియానా ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ కోసం వెయిట్ చేసినా ఆమెకి ఆఫర్స్ రాలేదు. దానితో పర్సనల్ లైఫ్ లో సెటిల్ అయ్యేందుకు రెడీ అయ్యింది. అయితే ఇలియానా ఉన్నట్టుండి తాను ప్రెగ్నెంట్ అంటూ అందరికి దిమ్మతిరిగే షాకిచ్చింది. ఇలియానా ప్రెగ్నెంట్ అయితే షాకవడం ఎందుకు అనుకుంటున్నారేమో.. అసలు ఆమెకి పెళ్లయిందా, లేదంటే ఎవరితోనైనా రిలేషన్ లో ఉందా అనేది చెప్పకుండా ప్రెగ్నెన్సీ విషయం చెబితే అలానే ఉంటుంది.

Advertisement
CJ Advs

ఇక ప్రెగ్నెంట్ గా బేబీ బంప్ ఫొటోస్ ని రివీల్ చేస్తున్న ఇలియానాకి పదే పదే బాయ్ ఫ్రెండ్ ప్రశ్నలే ఎదురవుతున్నాయి. అందుకే ఇలియానా కూడా అప్పుడప్పుడు తన బాయ్ ఫ్రెండ్ వివరాలను సోషల్ మీడియాలో ఉంచినా.. పూర్తిగా ఆమె ఎవరితో రిలేషన్ లో ఉందో అనేది చెప్పకుండా సస్పెన్స్ మాయింటింగ్ చేస్తూ వచ్చింది. ఈ క్రమంలో చాలామంది పేర్లు తెరపైకి వచ్చాయి. దానితో ఇలియానా లైఫ్ లో ఉన్న ఆ మిస్టరీ మ్యాన్‌‌ గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి అందరిలో పెరిగింది.

తాజాగా ఇలియానా ఈ సస్పెన్స్ కి తెరదించింది. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో తన జీవితంలోకి వచ్చిన ఆ వ్యక్తి ఎవరో చూపించేసింది. బ్లాక్ షర్ట్ ధరించి, గడ్డంతో వ్యక్తితో ఇలియానా సన్నిహితంగా ఉన్న ఫొటోలను షేర్ చేసింది. అయితే ఇలియానా ఇక్కడ కూడా దాగుడుమూతలాడింది. ఆమె లైఫ్ తన లోకి వచ్చిన అతనికి సంబంధించిన వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఆ ఫొటోస్ తో పాటుగా ఇలియానా డేట్ నైట్ అంటూ క్యాప్షన్ పెట్టింది. ఇలియానా షేర్ చేసిన ఫొటోస్ చూడగానే అయ్యో కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ అనుకున్నాం.. కానీ కాదే అంటూ ఆశ్చర్యపోతున్నారు నెటిజెన్స్.

Finally, Ileana showed her boyfriend:

Ileana Finally Reveals Her Mystery Man
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs