మహేష్-త్రివిక్రమ్ కలయికలో హ్యాట్రిక్ మూవీగా తెరకెక్కుతున్న గుంటూరు కారం షూటింగ్ నిన్న సండే అయినప్పటికీ చిత్రీకరణ హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఫుల్ స్వింగ్ లో నడుస్తుంది. ఇదే స్పీడు తో చక చకా గుంటూరు కారంలో కీలకమైన టాకీ పార్ట్ పూర్తి చేసే ప్లాన్ లో ఉన్నారు త్రివిక్రమ్. ఈ మంత్ ఎండ్ వరకు కంటిన్యూ అయ్యే ఈ షెడ్యూల్ లో మహేష్ బాబు మీద కీలక సన్నివేశాలని పిక్చరైజ్ చేస్తారు దర్శకుడు త్రివిక్రమ్.
అయితే మహేష్ బాబు ఆగష్టు మొదటివారంలో గుంటూరు కారం షూటింగ్ పక్కనపెట్టేసి మళ్ళీ వెకేషన్ కి వెళ్లిపోతున్నారు. ఆగష్టు మొదటి వారం నుండి ఆగష్టు రెండో వారం చివరి వరకు ఆయన వెకేషన్ లోనే ఉంటారు. అంటే మహేష్ బాబు తన పుట్టిన రోజు ఆగష్టు9 నాటికి ఫాన్స్ కి అందుబాటులో ఉండరు. ఆగష్టు రెండో వారం తర్వాతే ఆయన హైదరాబాద్ కి వస్తారు. అయితే మహేష్ లేని సమయంలో గుంటూరు కారం షూటింగ్ ఆగకున్నా త్రివిక్రమ్ మిగతా ఆర్టిస్ట్ ల మీద చిత్రీకరణ నిర్వహిస్తారు. ఆ మేరకు చర్చలు జరిగాయి. మహేష్ ఈ విషయంలో చాలా క్లారిటీగా ఉన్నారని తెలుస్తుంది. తాను లేకపోయినా గుంటూరు కారం షూటింగ్ ఆగకూడదని ఆయన త్రివికమ్ కి చెప్పినట్లుగా తెలుస్తోంది.
యాస్ ఎర్లీ యాస్ పోజిబుల్ సినిమా షూటింగ్ పూర్తి కావాలని మహేష్ చెప్పినట్లుగా సమాచారం. శ్రీలీల మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి సెకండ్ లీడ్ లో కనిపించబోతుంది. జగపతి బాబు విలన్ గా మోడ్రెన్ రోల్ లో కనిపించబోతున్నారు.