పవన్ కళ్యాణ్-క్రిష్ కలయికలో పిరియాడికల్ డ్రామాగా మొదలైన హరి హర వీరమల్లు మూవీ షూటింగ్ ఇకపై జరుగుతుందా.. లేదంటే ఈ ప్రాజెక్ట్ ని హోల్డ్ లో పెట్టారా.. అసలు ఆగిపోయిందా ఇలా ఏది అర్ధం కాక పవన్ ఫాన్స్ అయోమయంలో ఉన్నారు. హరి హర వీరమల్లు మూవీ షూటింగ్ గత డిసెంబర్ లో ఆగింది. గత ఏడాది అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు నిర్విరామంగా పవన్ కళ్యాణ్ 45 రోజుల పాటు దానికి కోసం డేట్స్ కేటాయించారు. ఆ తర్వాత పవన్ అది పూర్తిగా పక్కనబెట్టి OG, BRO, ఉస్తాద్ షూటింగ్స్ కి హాజరవుతున్నారు. ఇదోగో పవన్ హరి హర వీరమల్లు సెట్స్ లోకి వెళతారు.
అదిగో పవన్ వెళుతున్నారు అనడమే కానీ హరి హర వీరమల్లు షూటింగ్ ఇంతవరకు కదల్లేదు. దానితో ఈ చిత్రం ఆగిపోయింది అనుకుంటున్నారు. నిర్మాత ఏ ఏం రత్నం కూడా ఈ విషయమై ఎక్కడా స్పందించనే లేదు. దానితో పూర్తిగా ఈ ప్రాజెక్ట్ విషయం మర్చిపోయారు. తాజాగా ఏ ఏం రత్నం హరి హర వీరమల్లు మూవీ ఆగిపోలేదు. ఇప్పటివరకు ఈ సినిమా చిత్రీకరణ 60 శాతం పూర్తయ్యింది. మిగతా షూటింగ్ కూడా చక చకా పూర్తి చేసి 2024 ఎన్నికల లోపు సినిమాని రిలీజ్ చేస్తామని చెప్పడంతో.. ఈ ప్రాజెక్ట్ పై ప్రేక్షకులకి ఓ క్లారిటీ వచ్చింది.
ఈమధ్యనే హీరోయిన్ నిధి అగర్వాల్ పవన్ కళ్యాణ్ తో వర్క్ చేయడంపై స్పందించింది. ఆయనతో పని చెయ్యడం ఆనందంగా ఉంది అంటూ ట్వీట్ చేసింది.