Advertisement
Google Ads BL

అల్లు అర్జున్ కూతురికి నిమిషానికి 2 లక్షలట


స్టార్ కిడ్స్ ఎవ్వరికి కనబడకుండా.. సీక్రెట్ గా ఉండకుండా.. పబ్లిక్ లోకి వచ్చేస్తున్నారు. మహేష్ ఫ్యామిలీ అయితే అందరికి భిన్నంగా వెకేషన్స్ ని ఎంజాయ్ చేసే విషయము, యాడ్స్ చేసే విషయం ఇలా ఏదైనా అందరికి తెలిసేలా చేస్తారు. ఇక అల్లు అర్జున్ కూడా తన పిల్లలతో ఎక్కువగా ఫ్యాన్స్ కి అందుబాటులోనే ఉంటారు. మహేష్ కుమార్తె గతంలోనే తన తండ్రితో కలిసి పలు టీవీ యాడ్స్ చేసింది. రీసెంట్ గా సితార సోలో గా జ్యువెలరీ యాడ్ చేసింది. ఆ యాడ్ కోసం సితార దాదాపుగా కోటి పైగానే అందుకుంది అని ప్రచారం జరుగుతుంది. తన మొదటి పారితోషకం ఛారిటీకి ఇచ్చేస్తానంటూ అందరి మనసులని సితార దోచేసింది.

Advertisement
CJ Advs

ఇక అల్లు అర్జున్ కూడా తన కుమర్తె అల్లు అర్హని శాకుంతలం లాంటి ప్యాన్ ఇండియా మూవీతోనే ఎంట్రీ ఇప్పించాడు. చిన్నారి భరతుడిగా అల్లు అర్హ తన పాత్రలో చక్కగా నటించింది. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ దేవరలో కొద్దిసేపు కనిపించబోతుంది అంటున్నారు. ఓ పది నిమిషాల నిడివి గల పాత్రలో అల్లు అర్హ కనిపిస్తుందట. అయితే ఈ పాత్ర కోసం అర్హకి నిమిషానికి 2 లక్షల చొప్పున పారితోషకం ఇవ్వబోతున్నారట దేవర మేకర్స్. జాన్వీ కపూర్ చిన్ననాటి పాత్రలో అల్లు అర్హ కనిపిస్తుంది అని.. ఆ పాత్ర లో పది నిమిషాల అభినయం అల్లు అర్హ చెయ్యబోతుందట. 

మరి 10 నిమిషాల పాత్ర కోసం అల్లు అర్హ 20 లక్షల పారితోషకం అందుకుంటుంది అంటే.. ఇంత చిన్న వయసులోనే అర్హ రేర్ ఫీట్ సాధించినట్టే కదా. వచ్చే నెల నుండే అల్లు అర్హ దేవర షూటింగ్ లో పాల్గొనబోతున్నట్టుగా ఆ న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.

2 lakh per minute for Allu Arjun daughter:

Allu Arha Remuneration details
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs