Advertisement
Google Ads BL

ఆప్తమిత్రుడిని పక్కన పెట్టేసిన పవన్


ఎలుగెత్తు.. ఎదురించు.. ఎన్నుకో అంటూ పెట్టిన స్టేటస్ మెసేజ్ కి దూరంగా, అందరి అంచనాలకు భిన్నంగా సినిమా రిలేటెడ్ పోస్ట్ తో ఇన్ స్టా జర్నీ స్టార్ట్ చేసారు పవన్ కళ్యాణ్. సీనియర్ హీరోలైన అమితాబ్, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లతో పాటు తన సమకాలీన స్టార్స్ మహేష్, ప్రభాస్, ఎన్ఠీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, రవితేజ తదితరులతో కలిసి ఉన్న ఫొటోస్ పంచుకున్న పవన్ పలువురు దర్శక, నిర్మాతలు, నటీనటులతో ఉన్న పిక్స్ కూడా యాడ్ చేసి మన బంధం ఇలాగే కొనసాగాలని, మరెన్నో మధురమైన జ్ఞాపకాల్ని పంచుకోవాలని ఆశిస్తున్నట్టు ప్రకటించారు. అందరు హీరోల అభిమానుల్ని ఆకట్టుకునేలా వున్న ఈ పోస్ట్ పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతున్నప్పటికీ ఒకట్రెండు ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.

Advertisement
CJ Advs

అందులో ముఖ్యమైన అంశం ఆప్త మిత్రుడు అలీని పక్కనపెట్టడం.! బ్రహ్మానందం, ఎం ఎస్ నారాయణ, తనికెళ్ళ భరణి, సునీల్, శ్రీనివాసరెడ్డి, వేణు మాధవ్ ల దగ్గరనుంచి చోటా మోటా కమెడియన్స్ అయిన సప్తగిరి, సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, షకలక శంకర్ ల వరకూ పవన్ పంచిన ఫొటోల్లో స్థానం దక్కించుకుంటే అలీ మాత్రం ఆ గుర్తింపుకి నోచుకోలేకపోయారు. బాలీవుడ్ కమెడియన్ జానీ లీవర్ కూడా పవన్ కి గుర్తొచ్చారు కానీ అలీని మాత్రం కావాలనే మరిచిపోయినట్టుగా ఉన్నారు. ఇందుకు కారణమేంటో కూడా అందరికీ  తెలిసిందే. 2019 ఎన్నికల సమయంలో వైసీపీ తీర్ధం పుచ్చుకున్న అలీ ఆపై కొన్ని రాజకీయ ప్రసంగాలు చేసారు. అందుకు తగ్గ నజరానా ప్రభుత్వం నుంచి అందుకున్నారు. అయితే రాజకీయాలు వేరు, సినిమా వేరు ఇప్పటికీ పవన్ నాకు అత్యంత సన్నిహితుడే, ఆయన ఫోటో నా పర్స్ లో ఉంటుంది అని చెప్పుకునే అలీ కేవలం ఫ్లైట్ మిస్ అవడం వల్లే తన కుమార్తె వివాహానికి పవన్ హాజరు కాలేదని ఆమధ్య మీడియా ముందు సర్ది చెప్పుకొచ్చారు. కానీ అలీ లేకుండా సినిమా చెయ్యలేను అని అప్పట్లో చెప్పిన పవన్ 2019 నుంచి మాత్రం తన సినిమాలో కనిపించే అవకాశం అలీకి ఇవ్వడం లేదు. ఇప్పుడిలా ఒక ఫోటో సైతం పెట్టేందుకు ఇష్టపడలేదంటే పవన్ మనసుని అలీ ఎంత కష్టపెట్టి ఉంటారో అర్ధం చేసుకోవచ్చు. ఎంతైనా రాజకీయం కదా. రక్త సంబంధాలనే విడగొట్టేది - స్నేహ బంధాన్ని దూరం చెయ్యలేదా..!

అన్నట్టు అలీ ఒక్కడే కాదండోయ్ దాదాపు దశాబ్దం పాటు పవన్ పంచనే ఉండి, ప్రతి క్షణం పవన్ పక్కనే తిరిగిన శరత్ మరార్ కూడా ఈ పోస్ట్ లో కనిపించలేదు. మరి ఆయన విషయంలో ఏం జరిగిందో.! అలాగే హీరోగా తనని పరిచయం చేసిన EVV సత్యన్నారాయణ ఫోటోని గుర్తుపెట్టుకుని మరీ ఇంక్లూడ్ చేసిన పవన్ కళ్యాణ్ అదే చిత్ర నిర్మాత అల్లు అరవింద్ ని ఎందుకు విస్మరించారో..!

Pawan Kalyan left his best friend aside:

Pawan Kalyan forgot his best friend
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs