పవన్ కళ్యాణ్ రీసెంట్ గానే సోషల్ మీడియాలో కీలకమైన ఇంస్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయన జస్ట్ అకౌంట్ ఓపెన్ చేసి ఎలాంటి పోస్ట్ చెయ్యకపోయినా 2 మిలియన్ ఫాలోవర్స్ ఆయన ఖాతాలోకి వచ్చి చేరారు. పవన్ కళ్యాణ్ స్టామినా ఇక్కడే సగం ప్రూవ్ అయ్యింది. ఆయనకున్న అభిమాన గణం.. ఒక్క పోస్ట్ కూడా వెయ్యకుండానే ఇన్స్టాలో ఆయన్ని అందనంత ఎత్తులో నిలబెట్టారు. అయితే మొన్ననే ఇన్స్టాలోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ నేటి సాయంత్రం అంటే జులై 15 శనివారం సాయంత్రం తొలి పోస్ట్ వేశారు.
తన అన్నయ్య చిరంజీవి తనకు ముద్దు పెట్టిన ఫోటోను ఇన్‌స్టా పోస్టులో మొదట పొందు పరిచారు.. దానితో పాటుగా ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకాలు! చలన చిత్ర పరిశ్రమలో భాగమై ఎంతో మంది ప్రతిభావంతులతో, నిరాడంబరమైన వ్యక్తులతో కలిసి ప్రయాణిస్తున్నందుకు కృతజ్ఞుణ్ణి.. అంటూ పోస్ట్ చేశారు. ఇంకా పవన్ కళ్యాణ్ తన చిత్రాలలో బాలకృష్ణ, తనకు ఎంతో ఇష్టమైన నటుడిగా చెప్పే అమితాబ్ బచ్చన్, నాగార్జున, వెంకటేష్ సహా తోటి హీరోలు మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్, రవితేజతో పాటు ఎంతో మంది సీనియర్ & జూనియర్ హీరోల, దర్శకులతో, హీరోయిన్లతో, సంగీత దర్శకులు, సాంకేతిక నిపుణులతో దిగిన ఫోటోలను ఆయన పోస్ట్ చేశారు.
ఆ చిత్రాలతో పాటుగా పవన్ కళ్యాణ్,, మన బధం ఇలానే కొనసాగాలని, మరెన్నో మధురమైన జ్ఞాపకాల్ని పంచుకోవాలని ఆశిస్తూ.. అంటూ పెట్టిన పోస్ట్ నిమిషాల్లో వైరల్ గా మారిపోయింది.