Advertisement
Google Ads BL

సీరియల్ యాక్టర్ తుపాకీ కాల్పలు


హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన శామీర్‌పేట సెలబ్రిటీ క్లబ్‌లో కాల్పుల కలకలం సృష్టించింది. ప్రముఖ సీరియల్ నటుడు మనోజ్ నాయుడు సిద్ధార్ధ్‌దాస్‌ అనే వ్యక్తిపై కాల్పులు జరిపాడు. అసలు మనోజ్ నాయుడు సిద్దార్థ్ పై ఎందుకు కాల్పులు జరిపాడంటే.. 2019 లోనే సిద్ధార్థ దాస్, భార్య గ్రంధి స్మిత ఇద్దరూ విడిపోయి విడిగా ఉంటున్నారు. అయితే గ్రంధి స్మిత మనోజ్ నాయుడు అనే సీరియల్ నటుడుతో సహజీవనం చేస్తూ శామీర్ పేట సెలబ్రిటీ క్లబ్‌లో నివాసం ఉంటుంది. 

Advertisement
CJ Advs

మనోజ్ స్మితలతో పాటు సిద్ధార్థతో స్మితకు కలిగిన ఇద్దరు పిల్లలు కూతురు (7) కొడుకు (9) కూడా వీరితోనే ఉంటున్నారు. శుక్రవారం సిద్ధార్థ్ తన పిల్లలను చూసేందుకు సెలబ్రిటీ క్లబ్‌కు వచ్చాడు. అయితే సిద్దార్ధ తో మనోజ్ తమని కొడుతున్నాడని పిల్లలు చెప్పడంతో.. సిద్దార్థ్ మనోజ్ తో గొడవకి దిగినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ గొడవ పెరిగి మనోజ్ ఎయిర్ గన్‌తో సిద్ధార్ధ పై కాల్పులు జరిపాడు. గాయపడిన సిద్దార్థను ఆసుపత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేసారు.. నటుడు మనోజ్ ప్రస్తుతం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సీరియల్ లో లీడింగ్ కేరెక్టర్ లో నటిస్తున్నాడు.

Gun Firing at Shamirpet Celebrity Club:

Gunfire at Shamirpet celebrity club; Serial artist involved
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs