మిల్కి బ్యూటీ తమన్నా.. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ లో ప్రేమలో ఉన్నారు. గతంలో సీక్రెట్ గా తమ డేటింగ్ విషయాన్ని మెయింటింగ్ చేసిన ఈ జంట లస్ట్ స్టోరీస్2 ప్రమోషన్స్ లో తమ ప్రేమని బయటపెట్టేసారు. లస్ట్ స్టోరీస్2 షూటింగ్ లోనే ప్రేమలో పడ్డామని.. ఒకరంటే ఒకరికి గౌరవం అంటూ వీరి ప్రేమని రివీల్ చేసారు. ఓ ఏడాది పాటు అందరిలో అనుమానాలు రేపిన ఈ జంట ఫైనల్లీ డేటింగ్ విషయాన్ని రివీల్ చేసారు.
అయితే తాజాగా మేమిద్దరం డేటింగ్‌లో ఉన్నామని నాకిప్పుడు బాగా అర్థమైంది అంటూ విజయ్ వర్మ సరదాగా తమన్నాతో రిలేషన్ పై స్పందించాడు. తనతో నేను ఎంతో సంతోషంగా ఉన్నా. తనను పిచ్చిగా ప్రేమిస్తున్నా. తాను నా లైఫ్‌లో అడుగుపెట్టాక విలన్ దశ ముగిసిపోయింది. ఇకపై రొమాంటిక్ దశ మొదలైంది అంటూ విజయ్ వర్మ సరదాగా కామెంట్స్ చేసాడు.
విజయ్ మర్మ మాత్రమే కాదు గతంలో తమన్నా కూడా.. ఆడవాళ్ళని, అందులోను కుటుంబంలో అమ్మాయిలని గౌరవించే విజయ్ అంటే చాలా ఇష్టం.. తనని కూడా ఆలానే చూసుకుంటాడు. ఆ నమ్మకం నాకుంది. ఎవరినైనా ప్రేమించాలంటే వాళ్లతో సంతోషంగా ఉండగలమనే భావన కలగాలి. విజయ్‌తో నాకు అలాగే అనిపించింది. నేను ఇప్పటివరకూ ఎంతో మంది హీరోలతో కలిసి నటించా. వాళ్లందరి కంటే విజయ్ నాకు ఎంతో స్పెషల్ అంటూ విజయ్ వర్మపై తమన్నా అప్పట్లో చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.