Advertisement
Google Ads BL

విడాకుల నేపథ్యంలో నాగ చైతన్య సినిమా


నాగ చైతన్య కెరీర్ లో వరస వైఫల్యాలతో సతమతమవుతున్నాడు. రీసెంట్ గానే కస్టడీ మూవీతో డిసాస్టర్ అందుకున్న నాగ చైతన్య తన తదుపరి మూవీని చందు మొండేటితో చేస్తున్న విషయం తెలిసింది. చందు మొండేటి నాగ చైతన్య కలయికలో తెరకెక్కబోయే చిత్రంపై అందరిలో ఆసక్తి మొదలు కాగా.. ఈ చిత్రం శ్రీకాకుళం నేపథ్యంలో ఉండబోతుంది అని తెలుస్తుంది. అయితే ఈ చిత్రంతో పాటుగా నాగ చైతన్య సామజవరగమన దర్శకుడితో కూడా కమిట్ అయినట్లుగా తెలుస్తుంది. 

Advertisement
CJ Advs

రీసెంట్ గా శ్రీ విష్ణుతో రామ్ అబ్బరాజు తెరకెక్కించిన సామజవరగమన మూవీ సూపర్ హిట్ అవ్వగా.. అది ఇప్పటికీ థియేటర్స్ లో కలెక్షన్స్ కొల్లగొడుతోంది. అయితే నాగ చైతన్య, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో చెయ్యబోయే మూవీ విడాకుల నేపథ్యంలో ఉండబోతుంది అనే ప్రచారం జరుగుతుంది. మరి నిజంగా విడాకుల నేపథ్యంలో సినిమా అంటే అది చాలా ఇంట్రెస్టింగ్ గా ప్రేక్షకుల్లోకి వెళుతుంది. కారణం నాగ చైతన్య వ్యక్తిగతంగా సమంతతో పెళ్లి, విడాకులతో బాగా హైలెట్ అయిన విషయం అందరికి తెలుసు. ఇప్పుడు అదే నేపథ్యంలో మూవీ అంటే ఖచ్చితంగా అందరిలో క్యూరియాసిటీ మొదలవుతుంది.

సో ఈ మూవీ మొదలు పెట్టకముందే అందరి చూపు ఈ ప్రాజెక్ట్ పై పడేలా మేకర్స్ ప్లాన్ చేసి బ్యాగ్ డ్రాప్ ఇలా ఉండబోతుంది అని రివీల్ చేసేసారు అనుకుంటా. ప్రస్తుతం ఇదే టాపిక్ పై చర్చలు కూడా మొదలైపోయాయి.

Naga Chaitanya Ram Abbaraju movies backdrop revealed:

Naga Chaitanya Making A Film On Divorce
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs