Advertisement
Google Ads BL

సమంత అమెరికా ప్రయాణం వెనుక కారణం!


సమంత ప్రస్తుతం నటనకు దాదాపు ఏడాది కాలం బ్రేక్ ఇచ్చేసింది. నిన్ననే సిటాడెల్ షూటింగ్ కంప్లీట్ చేసేసింది. ఇప్పుడు ఆరోగ్యం కోసం అమెరికా వెళ్లబోతుంది. ఈ విషయమై ఎవరిలో స్పష్టత లేదు. అయితే సమంత ఇంత పెద్ద లాంగ్ బ్రేక్ తీసుకోవడం ఆమె అభిమానులని అందోళన పెడుతుంది. గత ఆరు నెలలుగా తనకి ఎంత క్లిష్టమైన సమయమో అంటూ ఇన్స్టా పోస్ట్ పెటిన దగ్గరనుండి ఆమె ఫాన్స్ చాలా ఇదైపోతున్నారు. అయితే సమంత ఇప్పుడు నటనకు బ్రేకిచ్చి చికిత్స కోసం అమెరికా వెళ్లడంపై ఆమె హెయిర్ స్టైలిస్ట్ ఎమోషనల్ అవుతున్నాడు.

Advertisement
CJ Advs

కొన్నేళ్లుగా సమంతకి హెయిర్ స్టైలిస్ట్ గా పని చేస్తున్న రోహిత్ బాట్మార్ ఇన్స్టా లో ఇలా పోస్ట్ పెట్టాడు. రెండేళ్లు.. ఒక మ్యూజిక్ ఆడియో, 7 బ్రాండ్ క్యాంపెయిన్స్,  2 ఎడిటోరియల్స్ జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలను పోగేసుకున్నాం. ఎండ, వాన లెక్క చెయ్యకుండా పని చేసాం, నవ్వులు, బాధలు, కన్నీళ్లు అన్నీ చిరునవ్వుతో స్వీకరించాం. మా జర్నీలో ఎన్నో ఎత్తుపల్లాలు, ఆటుపోట్లు ఎదురయ్యాయి. చికిత్స తీసుకుంటున్న టైమ్ లో మీకు మరింత బలం, శక్తి రావాలని కోరుకుంటున్నాం. 

ఇంతకుముందు కంటే రెట్టింపు శక్తి, ఉత్సాహంతో తిరిగి రావాలని కోరుకుంటున్నాం. మళ్ళీ మిమ్మల్ని కలిసే రోజు కోసం ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటామంటూ రోహిత్ సమంత ఫొటోస్ ని షేర్ చేస్తూ ఎమోషనల్ గా పెట్టిన పోస్ట్ తో సమంత నిజంగానే అమెరికాకి చికిత్స కోసం వెళ్ళింది అనే విషయం స్పష్టమైంది. 

Samantha to take a break for healing journey:

Samantha hair stylist Rohit Bhatkar pens heartfelt note as she goes on her healing journey
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs