మెగా ఫ్యామిలీలోకి చిరు కుమార్తెల ద్వారా ఎంతమంది మనవరాళ్లు వచ్చినా.. రామ్ చరణ్ కుమార్తె మాత్రం చాలా ప్రత్యేకం. రామ్ చరణ్-ఉపాసనలు 11 ఏళ్ళ తర్వాత మెగా ఫ్యామిలికి వారసురాలిని అందించారు. ఉపాసన ప్రెగ్నెంట్ తో ఉండి హెల్దీ గా చక్కగా భర్తతో కలిసి అన్ని దేశాలు చుట్టేసి వచ్చింది. బేబీ కడుపులో ఉండగానే ఆస్కార్ ఈవెంట్ కి వెళ్ళింది ఉపాసన. ఇక తమ కుమార్తె క్లింకార పుట్టినప్పుడు కూడా అపోలో ఆసుపత్రిలో ఓ గదిని ప్రత్యేకముగా అలంకరించారట. ప్రకృతి ఒడిలో ఉన్న ఫీలింగ్ కలిగేలా ఆ గదిని అలంకరించారట.
ఆసుపత్రిలో ఉన్నా కుడా ఇంట్లో ఉన్నట్లుగా ఫీల్ అయ్యేలా గాడి గోడలని అలంకరించారట. బేబీ పుట్టగానే చెట్లు, పక్షలు, కనిపించేలా కిటికీ కర్టెన్స్ డిజైన్ చేశారట. దీనికి సంబందించిన వీడియోని ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేసింది. అమ్రాబాద్ ఫారెస్ట్, వేద వైద్యం ద్వారా ప్రేరణ పొందిన ఈ సుందరమైన ప్రదేశంలో నేను జన్మించడం, నా క్లింకారని పెంచడం ఎంత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పలేను. థాంక్యూ పవిత్ర రాజ్ రామ్ అంటూ చెప్పుకొచ్చింది. ఈ మధ్యనే ప్రకృతి ఒడిలో అంటే మామిడి చెట్టు కిందే డెకరేషన్ చేసి తమ పాపకి క్లింకారాగా చరణ్ దంపతులు నామకరణం చేసారు.
మెగాస్టార్ తమ వారసురాలికి ఘనంగా బారసాల నిర్వహించారు. ప్రసుతం ఉపాసన తన పాపతో కలిసి తల్లితండ్రులు శోభన కామినేని ఇంట్లోనే మొయినాబాద్ లో ఉంటుంది. త్వరలోనే అత్తమామల ఇంటికి తన బిడ్డతో వచ్చేస్తుంది అని తెలుస్తుంది.