Advertisement
Google Ads BL

టైమ్ బ్యాడ్ కాకపోతే.. ఏంటిది సమంత?


సినిమా ఇండస్ట్రీలో ఏమాట అన్నా అది ఆన్ రికార్డ్ అయిపోతుంది. ఈ సోషల్ మీడియా వచ్చాక అది మరికాస్త ఎక్కువైంది. ప్రతి విషయంలోనూ హీరోలకున్న అభిమానులు మరింత హుషారుగా ఉంటూ, ప్రతి విషయానికి స్పందించడం ఇంకాస్త ఇబ్బందిగా మారుతుంది. అయితే ఎప్పుడో పదేళ్ళనాడు ఆ హీరోయిన్ అన్న మాటను పట్టుకుని ఇప్పుడు ఆమెను ట్రోల్ చేస్తున్నారు ఆ హీరో ఫ్యాన్స్. హీరోయిన్ సమంతకు సంతోషం కలిగినా, బాధ కలిగినా సోషల్ మీడియాలో పంచుకుంటుంది. ఏ విషయమైనా నిర్మొహమాటంగా మాట్లాడేస్తుంది. అలాగే నచ్చని విషయాన్ని కూడా ఖచ్చితంగా చెబుతుంది. ఇది ఆమెకు కొన్నిసార్లు మంచిచేసినా, మరికొన్ని సార్లు చేటు చేసింది. ఆ మధ్య తన అనారోగ్యం గురించి బయటపెట్టుకుని ఎక్కడలేని విమర్శలకు గురైంది. ఇక సినిమాల విషయంలోనూ తన ఫ్లాప్స్ అందుకుని, ఇబ్బందిపడుతూనే ఉంది. విషయంలోకి వస్తే..

Advertisement
CJ Advs

2013లో వచ్చిన ‘వన్ నేనొక్కడినే’ మూవీ పైన సమంత చేసిన కామెంట్స్ ఇప్పుడు అమ్మడికి రివర్స్ కొట్టాయి. దాదాపు పదేళ్ళకు సమంత కామెంట్స్‌కి రివర్స్‌లో ట్రోల్ చేసి పడేస్తున్నారు మహేష్ ఫ్యాన్స్. సుకుమార్ దర్శకత్వంలో మహేష్, కృతి సనన్ జంటగా నటించిన ఈ సినిమా పోస్టర్ విషయమై సమంత 2013 డిసెంబర్‌లో అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ పోస్టర్‌లో మహేష్ బీచ్‌లో నడుస్తుంటే అతని వెనుక ఉండి ఇసుకలోని కాలిజాడలను కృతి సనన్ తాకుతూ కనిపిస్తుంది. ఇది సరిగా లేదంటూ, ఆడవారిని అలా తక్కువగా చూపించారని, మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని.. సమంత చేసిన కామెంట్స్ అప్పట్లో వైరల్ అయ్యాయి. ఆడవాళ్ళు బానిసలనేట్టుగా పోస్టర్ ఉందని తన అభిప్రాయాన్ని బయట పెట్టింది. దీనికి అప్పట్లోనే చిన్న విషయాన్ని అనవసరంగా పెద్దది చేయద్దని, చెప్పుకొచ్చారు ఫ్యాన్స్. అంతా బాగానే ఉంది కానీ ఇదే సమస్య దాదాపు పదేళ్ళకు సమంతకు ఎదురైంది. దీనిని బేస్ చేసుకుని మహేష్ ఫ్యాన్స్ నెట్టింట్లో సమంతను ట్రోల్ చేస్తున్నారు.

సమంత, విజయ్ దేవరకొండ కలిపి నటించిన మూవీ ఖుషి. ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. రీసెంట్‌గా విడుదలైన సాంగ్‌లో ఓ షాట్‌లో విజయ్ దేవరకొండ పాదాల దగ్గర సమంత కూర్చుని ఉంటే, విజయ్ సమంత చేతిని కాలితో తాకుతున్నట్టుగా ఉంది. దీన్ని చూసి పదేళ్ళ నాడు అడుగుల్ని తాకితేనే మనోభావాలు దెబ్బతిన్నాయ్ అన్నావ్ మరి ఇదేంటని తెగ ఆడుకుంటున్నారట నెటిజన్లు. ఇంతలా ఎప్పుడో పదేళ్ళనాడు అన్న మాటలు తిరిగి తిరిగి వచ్చి తలనొప్పిగా మారడం ఏంటో గానీ.. పాపం సమంత ఈ మధ్యకాలంలో పెద్దగా కాలం కలిసి రావడం లేదని ఆమె అభిమానులు జాలీ పడుతున్నారు. అటు ఒక హిట్టూ పడక, ఇటు ఆరోగ్యం బాగోక, ఇలా ఎప్పటి మాటలో దారి కాసి ట్రోల్స్ రూపంలో కక్ష తీర్చుకోవడం నిజంగా టైం బ్యాడే.

Mahesh Babu Fans Trolling on Samantha:

Mahesh Fans Fires on Samantha with Kushi Song Shot
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs