Advertisement
Google Ads BL

అప్పుడు రష్మిక.. ఇప్పుడు శ్రీలీల?


రీసెంట్‌గా ‘రంగబలి’ చిత్ర ప్రమోషన్స్‌లో శ్రీలీల గురించి హీరో నాగశౌర్య ఓ విషయం రివీల్ చేశాడు. తన కెరియర్‌లో బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రమైన ‘ఛలో’కి ఫస్ట్ హీరోయిన్‌గా శ్రీలీలనే అనుకున్నామనీ, కానీ ఆమె కాదని చెప్పడంతో రష్మిక మందన్నా ఆ సినిమాలో హీరోయిన్‌గా సెలక్ట్ అయిందని చెప్పాడు. ఇప్పుడు నితిన్ హీరోగా, వెంకీ కుడుమల దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం నుంచి రష్మిక మందన్నా తప్పుకున్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడీ ప్లేస్‌ని శ్రీలీలతో భర్తీ చేయించడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. 

Advertisement
CJ Advs

నిజంగా ఈ ప్రాజెక్ట్‌కి కూడా శ్రీలీల ఓకే అంటే.. బ్యాక్‌ టు బ్యాక్ నితిన్ చిత్రాలలో నటించిన హీరోయిన్‌గా క్రెడిట్ ఆమెకు సొంతం అవుతుంది. ప్రస్తుతం నితిన్ హీరోగా అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ చిత్రానికి దర్శకత్వం వహించిన వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో నితిన్ సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పుడు వెంకీ కుడుమలతో చేస్తున్న సినిమాకు రష్మిక తప్పుకోవడంతో.. శ్రీలీలను ఒప్పించేందుకు చిత్రయూనిట్ ప్రయత్నాలు చేస్తుందనేలా వార్తలు వినిపిస్తున్నాయి. 

అదే నిజమైతే మాత్రం.. ‘ఛలో’తో శ్రీలీలను డైరెక్ట్ చేసే ఛాన్స్ మిస్సయిన వెంకీ కుడుమలకు ఇప్పుడామె దొరికేసినట్లే. శ్రీలీల వదిలేసిన ‘ఛలో’ సినిమాతో రష్మిక మందన్నా స్టార్ హీరోయిన్ స్టేటస్‌కి వెళ్లిపోయింది. ఇప్పుడు రష్మిక వదిలేసిన నితిన్, వెంకీల ప్రాజెక్ట్‌లోకి శ్రీలీల వస్తే.. ఆమె ఫేట్ ఎలా మారుతుందో చూడాలి. అన్నట్లు ఈ హీరోయిన్ల రీప్లేస్ సినిమాలు రెండింటికి దర్శకుడు వెంకీ కుడుమలనే కావడం విశేషం. చూద్దాం.. ఫైనల్‌గా ఈ సినిమాకు శ్రీలీల ఓకే చెబుతుందో.. లేదంటో మరెవరైనా వచ్చి చేరుతారో.. 

Sreeleela Replaced Rashmika Mandanna for Nithiin Film:

Rashmika Out and Sreeleela in for Nithiin and Venky Kudumula Project
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs