Advertisement
Google Ads BL

పెళ్లి చేసుకుంటే అది పోతుంది: సదా


జయం సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చి కోలీవుడ్‌లో అపరిచితుడు మూవీతో సౌత్‌లో స్టార్ హీరోయిన్ రేంజ్‌కి చేరిన సదా.. ఆ తర్వాత మళ్ళీ ఆ రేంజ్ సక్సెస్ సాధించలేకపోయింది. వరుస ఫెయిల్యూర్స్‌తో ఫేడవుట్ లిస్ట్‌లోకి వెళ్ళిపోయింది. కొన్నేళ్ళుగా సిల్వర్ స్క్రీన్‌కి దూరంగా ఉన్న సదా మళ్ళీ మూడేళ్లుగా బుల్లితెరపై సందడి మొదలు పెట్టింది. ఢీ డాన్స్ షోలో జడ్జ్.. ఆ తర్వాత స్టార్ మాలో డాన్స్ షోస్ అయిన BB జోడి, నీతోనే డాన్స్ షో కి జడ్జ్‌గా వచ్చింది. 

Advertisement
CJ Advs

గ్లామర్‌గా ఇప్పటికీ అదే ఫిగర్‌ని మెయింటైన్ చేస్తున్న సదా.. ఇప్పటి వరకు పెళ్లి పేరు ఎత్తలేదు. గతంలో సదా ఎవరినో పెళ్లి చేసుకోబోతుంది అనే రూమర్ కానీ, ఆమె ప్రేమలో పడింది అనే పుకారు కానీ ఎక్కడా వినిపించింది లేదు. అయితే సదాకి 40 ఏళ్ళు దాటిపోయాయి. ఆమె వయసులో ఉన్న హీరోయిన్స్ అంతా పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యారు. కానీ సదా ఇంతవరకు పెళ్లి ఊసెత్తలేదు. అయితే తాను అసలు వెళ్లేందుకు చేసుకోలేదు అనేది తాజాగా ఆమె రివీల్ చేసింది.

పెళ్లి చేసుకుంటే ఫ్రీడమ్ పోతుంది. ఇప్పటివరకు చాలా ఆనందంగా ఉన్నాను. నాకిష్టమైన ఫీల్డ్‌లో ఉన్నాను. ఒకవేళ పెళ్లి చేసుకుంటే నాకు ఈ ఫ్రీడమ్ ఉంటుందా.. నా పని నేను చేసుకోగలనా..? ఒకవేళ మనల్ని అర్థం చేసుకునే వారు దొరుకుతారా.. ఒకవేళ దొరక్కపోతే..? అయినా ఇప్పుడు కొంతమంది గ్రాండ్‌గా పెళ్లి చేసుకుని చాలా త్వరగా విడిపోతున్నారు. ఇలా పెళ్లి చేసుకుని అలా విడిపోవడం ఎందుకు..? దానికన్నా పెళ్లి చేసుకోకపోవడమే బెటర్ కదా! అంటూ సదా పెళ్లి గురించిన విషయాలను చెప్పుకొచ్చింది.

Actress Sadha Opinion On Marriage:

Sadha Sensational Comments on Marriage
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs