Advertisement
Google Ads BL

మెగాస్టార్‌తో చేయనన్నాడా?


మెగాస్టార్‌తో అవకాశం వస్తే రవితేజ వంటి హీరోలే కాదని అనరు. కానీ ఇప్పుడొక కుర్ర హీరో మెగాస్టార్ చిరు సినిమాలో చేయనని చెబుతూ.. కామ్‌గా తప్పనుకున్నాడంటూ వార్తలొస్తున్నాయి. అతనెవరో కాదు యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డనే. ‘సోగ్గాడే చిన్నినాయనా’ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చేయనున్నారని ప్రచారం జరుగుతుంది. అది మలయాళ హిట్ మూవీ బ్రో డాడీకి రీమేక్ అంటున్నారు. మోహన్ లాల్-పృథ్వీ రాజ్ సుకుమారన్ కలయికగా తెరకెక్కిన బ్రో డాడీ అక్కడ హిట్ అవడంతో దానికి రీమేక్‌గా చిరు-సిద్దు జొన్నలగడ్డలు కలిసి కనిపించబోతున్నారనే న్యూస్ ఎప్పటినుండో వినిపిస్తుంది.

Advertisement
CJ Advs

ఈ చిత్రంలో మెగాస్టార్‌తో త్రిష జతకట్టబోతుంది అంటూ తెగ ప్రచారం జరుగుతుంది.. చిరు యుఎస్ ట్రిప్ పూర్తి చేసుకుని రాగానే ఆయన కొత్త సినిమా ప్రారంభం అవుతుందనే అప్‌డేట్ కూడా ఆయనే ఇచ్చారు. అయితే ఇప్పుడు సిద్ధు జొన్నలగడ్డ ఈ ప్రాజెక్టు నుండి తప్పుకున్నాడని తెలుస్తుంది. మెగాస్టార్ చిరుతో స్క్రీన్ షేర్ చేసుకుంటే.. దర్శకులు చిరుపై ఫోకస్ పెట్టి మిగతా హీరోలని తగ్గించేస్తారు అంటూ ఉంటారు. అందుకే సిద్దు జొన్నలగడ్డ ఈ మూవీ నుండి సైలెంట్‌గా తప్పుకున్నాడనే టాక్ నడుస్తుంది. 

ఈ చిత్రం నుండి సిద్దు తప్పుకోవడమే కరెక్ట్ అని ఆయన అభిమానులు ఫీలవుతుంటే.. మెగా ఫ్యాన్స్ మాత్రం చిరు సినిమాలో చేయను అని చెప్పడానికి ఎంత ధైర్యం.. నువ్వేమన్న పెద్ద హీరోవి అనుకుంటున్నావా అంటూ అతనిపై ఫైర్ అవుతున్నారు. ఇప్పుడతని ప్లేస్‌లో చిరంజీవి అంటే ఎంతో ఇష్టపడే ఆర్‌ఎక్స్100 హీరో కార్తికేయ పేరు, అలాగే నితిన్ పేరు కూడా వినిపిస్తోంది. వీరిద్దరిలో ఒకరు మాత్రం కన్ఫర్మ్ అయ్యే ఛాన్సుంది.

Siddu Jonnalagadda Out From Megastar Chiranjeevi Film:

Siddu Jonnalagadda Says No To Chiru Film
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs