Advertisement
Google Ads BL

నితిన్ సినిమా నుండి రష్మిక అవుట్


నేషనల్ క్రష్ పనైపోయింది అన్న సమయంలోనే మళ్ళీ బౌన్స్ బ్యాక్‌లా ఆఫర్స్ పట్టేస్తుంది. పుష్ప ద రైజ్ తర్వాత రష్మికకి తెలుగులో మరో ప్రాజెక్ట్ లేకుండా పోయింది. హిందీలోనూ కెరీర్ పరంగాను కిందామీదా పడుతుంది. కానీ ఈలోపులో రష్మిక తెలుగు, తమిళంలో బైలింగువల్ మూవీగా రెయిన్ బో మూవీని స్టార్ట్ చేసింది. అంతలోనే నితిన్-వెంకీ కుడుములతో VNR ట్రియో అంటూ రష్మిక యాక్టీవ్‌గా కనిపించింది. భీష్మతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నితిన్ మళ్ళీ వెంకీ కుడుములతో మూవీకి రెడీ అవడమే కాదు.. అందులోనూ రష్మికనే హీరోయిన్‌గా ఫిక్స్ చేశారు.

Advertisement
CJ Advs

దీంతో మళ్లీ రష్మికా మందన్నకి మంచిరోజులొచ్చాయి అనుకున్నారు. ప్రస్తుతం రష్మిక మందన్నా పుష్ప ద రూల్ ప్యాన్ ఇండియా ఫిల్మ్ షూటింగ్.. అలాగే రెయిన్ బో షూటింగ్స్‌లో బిజీ అయ్యింది. ఇకపై నితిన్-వెంకీ కుడుముల మూవీ షూట్‌లో జాయిన్ అవుతుంది అనుకున్న సమయంలో రష్మిక ఈ ప్రాజెక్టు నుండి తప్పుకుంది అనే న్యూస్ సోషల్ మీడియాలో హైలెట్ అయ్యింది. రష్మిక VNR ట్రియో నుండి తప్పుకుంది.. VNR నుండి VN మాత్రమే మిగిలింది అంటూ సోషల్ మీడియాలో న్యూస్ మొదలయ్యింది.

అయితే రష్మిక తప్పుకోవడానికి వేరే కారణాలేవి లేవని, డేట్స్ కుదరకపోవడం వల్లనే ఈ VNR ప్రాజెక్ట్ నుండి ఆమె తప్పుకుంది అనే న్యూస్ వినిపిస్తుంది. బాలీవుడ్‌లో చేస్తున్న రెండు ప్రాజెక్ట్స్, పుష్ప2, రెయినో.. ఫుల్ స్వింగ్‌లో షూటింగ్ జరుగుతుండటంతో డేట్స్ క్లాష్ ఏర్పడిందని, అందుకే నిర్మాతలతో సంప్రదించి.. రష్మిక ఈ ప్రాజెక్ట్‌ని వదులుకున్నట్లుగా తెలుస్తోంది.

Rashmika Mandanna Out From VNRTrio:

Rashmika Mandanna Takes Sensational Decision
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs