Advertisement
Google Ads BL

మోక్షజ్ఞ ఎంట్రీ: USలో బాలయ్య కామెంట్స్


నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీపై గత నాలుగేళ్లలో వచ్చిన న్యూస్ లు ఏ హీరో వారసుడిపై రాలేదనే చెప్పాలి. మెగాస్టార్ చిరు, నాగార్జున ఇలా తమ కొడుకులని కరెక్ట్ టైం లో హీరోలుగా దించారు. ఆఖరికి జూనియర్ ఎన్టీఆర్ కూడా చాలా చిన్న వయసులోనే హీరో అయ్యాడు. కానీ బాలకృష్ణ తన కొడుకు మోక్షజ్ఞ విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తూ నందమూరి అభిమానులకే నీరసం తెప్పిస్తున్నారు. ఎప్పుడో మోక్షుజ్ఞ ఎంట్రీ ఉంటుంది అని ప్రకటించిన ఆయన ఇంతవరకు ఆ ప్రాజెక్ట్ మొదలు పెట్టనే లేదు.

Advertisement
CJ Advs

ఎప్పుడు మొదలు పెడతారో క్లారిటీ ఇవ్వరు. గత నాలుగేళ్లుగా మోక్షజ్ఞ ఎంట్రీ మూవీ ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999 ఉంటుంది అని చెప్పడమే కానీ.. దానిపై స్పష్టత ఇవ్వడం లేదు. అయితే ఇప్పుడు బాలయ్య బాబు కొడుకు సినీ రంగ ప్రవేశం ఎప్పుడు ఉంటుంది అనే దానిపై మరోసారి సస్పెన్స్ క్రియేట్ చేసారు. అమెరికాలో తానా సభల్లో పాల్గొంటున్న బాలయ్యని కొడుకు సినీరంగ ఎంట్రీపై ప్రశ్నించగా.. దానికి బాలయ్య 2024 ఎన్నికల తర్వాత తాను ఆ సినిమా మీద దృష్టి పెట్టి తెరకెక్కిస్తానని చెప్పినట్లుగా తెలుస్తోంది. 

బాలకృష్ణ మాట్లాడుతూ మోక్షజ్ఞ తేజ ఎంట్రీ సినిమాగా ఆదిత్య 369 సినిమా సీక్వెల్ ఉండబోతుందని మరోసారి వెల్లడించినట్లు సమాచారం. ఇక అప్పట్లోనే ఆయన ఆదిత్య 999 కి దర్శకత్వం వహిస్తాను అన్నారు. అంటే కొడుకుని తన డైరెక్షన్ లోనే హీరోగా ఇంట్రడ్యూస్ చెయ్యబోతున్నారనేది నందమూరి అభిమానుల్లో ఉన్న నమ్మకం. 

Balayya said the same thing again about Mokshajna movie :

Balayya Confirms To USA About Son Debut
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs