Advertisement
Google Ads BL

సూపర్ స్టార్ తో నటించడమే నా డ్రీమ్: మృణాల్


సీతారామం బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత టాలీవుడ్ మృణాల్ ఠాకూర్ కి రెడ్ కార్పెట్ పరుస్తుంది అనుకుంటే.. అది జరగలేదు. ఆమెకి స్టార్ హీరోలు అవకాశాలు ఇవ్వలేదు. హిందీలో కూడా సీతారామం హిట్ అవడంతో మృణాల్ కి అక్కడ బ్యాక్ టు బ్యాక్ అవకాశాలు వచ్చాయి. కానీ మృణాల్ కి హింది కలిసి రాలేదు. అయినప్పటికీ గ్లామర్ విషయంలో తనలోని టాలెంట్ ని సోషల్ మీడియా ద్వారా బయటపెట్టింది. ఇక సీతారామం తర్వాత నెమ్మదిగా టాలీవుడ్ లో జెండా పాతడానికి రెడీ అయ్యింది. ఇప్పటికే మృణాల్ ఠాకూర్ నాని సినిమాలో నటిస్తుంది. దాని ఫస్ట్ లుక్ రెండురోజుల్లో రాబోతుంది.

Advertisement
CJ Advs

రీసెంట్ గానే విజయ్ దేవరకొండ-శివ నిర్వాణ సినిమాలో ఆఫర్ పట్టేసి షూట్ లో జాయిన్ అయ్యింది. మృణాల్ ఠాకూర్ ఈ మధ్యన సొషల్ మీడియాలో తరుచూ ట్రెండ్ అవుతుంది. గ్లామర్ ఫోటో షూట్స్ కానివ్వండి. కొత్త ప్రోజెక్టులలో ఆమె పేరు మోగనివ్వండి ఏదైనాసరే ట్విట్టర్ హ్యాండిల్ లో #MrunalThakur హాష్ ట్యాగ్ తరచూ ట్రెండింగ్ లోకి వస్తుంది. మృణాల్ ఠాకూర్ ఈ ఫీల్డ్ లోకి అంటే సినిమా ఇండిస్టీలోకి ఎంటర్ అయినప్పటినుండి ఒకే కల కంటుందట. అది సూపర్ స్టార్ మహేష్ తో నటించాలనే పెద్ద డ్రీమ్ తనకి ఉన్నట్లుగా చెప్పుకొచ్చింది.

మహేష్ బాబు తో పని చెయ్యడం నాకున్న అతి పెద్ద డ్రీమ్.. ఈ విషయంలో రోజూ కల కంటున్నాను అంటూ చెప్పుకొచ్చింది. మరి మృణాల్ ఠాకూర్ కి ఇంకొక సక్సెస్ తగిలితే మహేష్ సరసన చోటు సంపాదించడం ఎంతోసేపు పట్టదు. దానితో ఆమె డ్రీమ్ కూడా తీరిపోతుంది. 

My dream is to act with Mahesh Babu: Mrunal Thakur:

Working with Mahesh Babu is my biggest dream since I entered film industry: Mrunal
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs