కోలీవుడ్ టాప్ హీరో అజిత్ తన సినిమాలేవో తాను చేసుకుంటూ బైక్ రైడింగ్స్ ఇంకా కార్ రేస్ ఇలా తన పనేదో తాను చూసుకుంటూ చాలా సింపుల్ గా.. ఎవ్వరి జోలు తియ్యని హీరో. అజిత్ కనీసం సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ గా ఉండరు. తన సినిమాలు, షూటింగ్స్, ఆటలు, ఫ్యామిలీ ఇంతే అజిత్ ప్రపంచం. అలాంటి అజిత్ పై ఇప్పుడొక కోలీవుడ్ ప్రొడ్యూసర్ మోసగాడు అంటూ ఆరోపణలు చెయ్యడం కోలీవుడ్ లో కలకలం సృష్టించింది. నిర్మాత మాణకం నారాయణ్ అజిత్ గొప్పవాడు కాదు అతనొక మోసగాడు అంటూ ఆయన అజిత్ పై ఫైర్ అవుతున్నాడు.
అజిత్ తన దగ్గర డబ్బు తీసుకుని తిరిగి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడంటూ ఆయన మీడియాకి చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది. అజిత్ చాలా ఏళ్ళ క్రితం తన పేరెంట్స్ ని మలేషియాకి పంపించాలంటూ తన వద్ద డబ్బు తీసుకున్నాడు. ఆ తర్వాత తనకి ఓ సినిమా చేస్తానని.. ఆ సినిమాకొచ్చే పారితోషకంలో నాకిచ్చే డబ్బుని సర్దుబాటు చేస్తానని మాటిచ్చాడు. కానీ ఇంతవరకు నాకు డబ్బు తిరిగి ఇవ్వలేదు, నాతో సినిమా చెయ్యలేదు. అసలు అజిత్ ఆ విషయంపై మట్లాడడమే మానేసాడు. అజిత్ తనకి తానో పెద్ద మనిషి అనుకుంటాడు కానీ కాదు.. అతనొక మోసగాడు అంటూ ఆయన అజిత్ పై ఫైర్ అయ్యాడు.
అంతేకాకుండా అజిత్ ఒక్కో సినిమాకి 50 కోట్లపైనే పారితోషకం తీసుకుంటాడు. అతనికి నా డబ్బొక లెక్క కాదు. నా డబ్బు నాకిచ్చెయ్యొచ్చు కదా. అజిత్ తో సినిమాలు చేసిన ఏఎమ్ రత్నం, నేను ఇంకా చాలామంది నిర్మాతలు నష్టపోయామని, కానీ అజిత్ ఈ నిర్మాతలకి ఏ విధంగా సహాయం చెయ్యలేదు అంటూ మాణకం నారాయణ్ అజిత్ ని మోసగాడంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడుతున్నాడు.