నిన్నటివరకు గేమ్ ఛేంజర్ డేట్ విషయంలో మెగా ఫాన్స్ సోషల్ మీడియాలో దిల్ రాజు-శంకర్ లని ఓ ఆట ఆడుకున్నారు. మెగా ఫాన్స్ ఎంతగా అరిచి గోల చేసినా దిల్ రాజు వాళ్ళు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ డేట్ మాత్రం ఇవ్వలేదు. అసలు వచ్చే ఏడాది గేమ్ ఛేంజర్ మూవీ ఉంటుందా లేదా అనే అనుమానంలో మెగా ఫాన్స్ ఆందోళనపడుతుంటే ఇప్పుడు మరోసారి మెగా ఫాన్స్ ఆందోళన ఎక్కువయ్యే న్యూస్ ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.
అదేమిటంటే శంకర్ గేమ్ ఛేంజర్ కోసం ఓ చిన్న దర్శకుడిని రంగంలోకి దింపాడనే న్యూస్ చూసిన ఫాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిట్ సీరీస్ తో హిట్ కొట్టిన శైలేష్ కొలను తో గేమ్ ఛేంజర్ కి సంబందించిన కొన్ని సీన్స్ ని శంకర్ తెరకెక్కించారనే న్యూస్ వైరల్ గా మారింది. దానితో టాప్ డైరెక్టర్ అని శంకర్ ని నమ్ముకుంటే చరణ్ ని నట్టేట ముంచుతారా అంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అయితే దిల్ రాజు-డైరెక్టర్ శంకర్ లు కొన్ని చిన్న సీన్స్ కోసమే శైలేష్ కొలనుని పెట్టుకున్నారని.. హీరో రామ్ చరణ్ పై దర్శకుడు శైలేష్ కొలను ఎలాంటి సీన్స్ చిత్రీకరించలేదు అని చెబుతున్నారు. ఏది ఏమైనా ఇంత పెద్ద ప్రాజెక్ట్ లోకి ఓ చిన్న దర్శకుడి ఎంటర్ అవడంపై మెగా అభిమానుల్లో ఆందోళన కనిపిస్తుంది.