Advertisement
Google Ads BL

వెంకటేశ్ ఇష్టం.. మెగాస్టార్‌ని కలిశాక?


శ్రీవిష్ణు.. హిట్ ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా ఈ హీరో నుంచి సినిమా వస్తుందీ అంటే.. కచ్చితంగా అందులో ఏదో ఒక విషయం ఉంటుందనేలా పేరు సంపాదించుకున్న హీరో. కెరీర్ ప్రారంభం నుంచి.. ఆయన ఎన్నుకునే వైవిధ్యమైన కథలు ఆయనకి ఈ పేరును ఆపాదించిపెట్టాయి. మధ్యలో ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నా.. తన ప్రయత్నంలో మాత్రం ఎటువంటి లోపం లేదనేలా టాక్ తెచ్చుకున్న ఈ హీరో.. తాజాగా ‘సామజవరగమన’ సినిమాతో సక్సెస్‌ని సొంతం చేసుకున్నారు. ఈ సినిమా ఇప్పటికీ డీసెంట్ కలెక్షన్స్ రాబడుతూ.. బాక్సాఫీస్ వద్ద తన సత్తాని చాటుతోంది. ఈ నేపథ్యంలో శ్రీవిష్ణు తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన ఆనందాన్ని తెలియజేశారు. సినిమా విడుదలకు ముందు మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన సపోర్ట్‌కు ఆయన ఫిదా అయినట్లుగా తెలిపారు. 

Advertisement
CJ Advs

నేను విక్టరీ వెంకటేశ్‌‌గారికి వీరాభిమానిని. ఆయనది క్లీన్‌ ఇమేజ్‌. హీరో అంటే ఆయనలానే ఉండాలని అనుకునేవాడిని. ఇండస్ట్రీకి వచ్చిన తరవాత ప్రతి హీరోలోనూ ఓ మంచి క్వాలిటీ చూశాను. అంతెందుకు ‘సామజవరగమన’ కోసం మెగాస్టార్ చిరంజీవిగారిని కలిశాం. ఓ పది నిమిషాల అపాయింట్‌మెంట్ అడిగారు మా నిర్మాత. తీరా ఆయన దగ్గరకి వెళ్లిన తర్వాత మెగాస్టార్ మా టీమ్‌తో గంటసేపు మాట్లాడారు. సినిమాల గురించి, అందుకోసం ఆయన పడుతున్న కష్టం గురించీ మెగాస్టార్ చెబుతుంటే చాలా గొప్పగా అనిపించింది. అంత ఎదిగిన వ్యక్తి.. ఇంత ఒదుగుతూ ఎలా ఉన్నారా? అనుకొన్నాను. మెగాస్టార్ బ్లెసింగ్స్‌తో ఈ సినిమా ఇంకాస్త బాగా జనాల్లోకి వెళ్లిందని శ్రీవిష్ణు తన తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

మెగాస్టార్‌తో పాటు.. సినిమా విడుదల తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాపై తన ప్రేమను తెలియజేయడంపై కూడా శ్రీవిష్ణు తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇంకా మాస్ రాజా రవితేజ, న్యాచురల్ స్టార్ నాని తనకు ఫోన్ చేసి ఎంతగానో అభినందించినట్లుగా చెప్పారు. చాలా గ్యాప్ తర్వాత మంచి హిట్ రావడంతో ఆనందపడుతున్నట్లుగానూ, అలాగే బాక్సాఫీస్ వద్ద వినిపిస్తున్న ఫిగర్స్‌తో ఆశ్చర్యపోతున్నట్లుగా ఈ యంగ్ హీరో పేర్కొన్నారు.  

Sree Vishnu About Megastar Chiranjeevi Greatness:

Sree Vishnu Happy with Samajavaragamana Success
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs