అనసూయ భరద్వాజ్ ఈమధ్యన బాగా ట్రెండ్ అవుతున్న పేరు. కారణం ఆమె తన యానివర్సరీ రోజున భర్త భరద్వాజ్ తో కలిసి మినీ హనీమూన్ అంటూ థాయిలాండ్ బీచ్ లో రెచ్చిపోయి గ్లామర్ షో చేసింది. అక్కడ భర్తతో చెట్టాపట్టాలేసుకుని ఆ ట్రిప్ ని ఎంజాయ్ చేసి వచ్చింది. ఆ తర్వాత తాను విజయ్ దేవరకొండతో ఉన్న గొడవకి ఫుల్ స్టాప్ పెడుతున్నట్లుగా ప్రకటించింది. మానసిక ప్రశాంతత కోసమే తాను విజయ్ ఫాన్స్ తో గొడవని ఆపేస్తున్నట్లుగా చెప్పిన అనసూయ విమానం సినిమాలో సుమతిగా ఆకట్టుకుంది.
ఈమధ్యన పుష్ప పార్ట్ 2 షూటింగ్ కి హాజరవుతుంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే అనసూయ కొద్దిగా బరువు పెరిగింది అనే విమర్శల నడుమ కొన్నాళ్ళుగా తన జిమ్ ఫొటోస్ ని, వీడియోని షేర్ చేస్తూ తాను బరువు తగ్గేందుకు వర్కౌట్స్ చేస్తున్నట్లుగా చెప్పకనే చెబుతుంది. ఈరోజు సండే స్పెషల్ గా అనసూయ కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. పింక్ కలర్ అవుట్ ఫిట్ లో మెరిసిపోయింది. పింక్ ఫ్రాక్ లో అనసూయ ఇచ్చిన ఫోజులకి అభిమానులు ఫిదా అవుతున్నారు. బేబీ పింక్ ఫ్రాక్ లో హెయిర్ కట్టుకుని యాక్టీవ్ గా అందంగా కనిపించింది.
అనసూయ కొన్నాళ్లుగా కాస్త వెయిట్ పెరిగి తన బ్యూటిఫుల్ లుక్స్ ని మిస్ అవుతుంది అనిపించేలా ఉంటుంది. గతంలో స్వీట్ గా క్యూట్ గా కనిపించిన అనసూయ ఇప్పుడు ఆ అందంలో బరువు ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీరూ అనసూయ లేటెస్ట్ లుక్ ని ఓసారి చూసెయ్యండి.