లైగర్ సినిమా డిసాస్టర్ అయ్యి రేపు ఆగస్టు కి ఏడాది కావొస్తుంది. లైగర్ డిసాస్టర్ అని మొదటి షో టాక్ కే విజయ్ దేవరకొండకి అర్థమైపోయింది అని, ఆ సాయంత్రానికే ఆయన తన తదుపరి సినిమా ఖుషి షూటింగ్ కి రెడీ అయ్యాడంటూ ఈమధ్యనే విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ చెప్పాడు. లైగర్ సినిమా డిసాస్టర్ కన్నా ఎక్కువగా పూరీ జగన్నాథ్, ఛార్మీలు ఆ సినిమా బయ్యర్లతో పేచీ కారణంగా ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత లైగర్ విషయంలో పూరీ-ఛార్మీలు ఈడీ అధికారుల ప్రశ్నలతో సతమతయ్యారు. ఇక పూరీ జగన్నాథ్ రామ్ బర్త్ డే రోజున రామ్ తో డబుల్ ఇస్మార్ట్ ని ప్రకటించాడు.
ఇస్మార్ట్ శంకర్ హిట్ కావడంతో మళ్ళీ వారి కాంబోలో డబుల్ ఇస్మార్ట్ రాబోతున్నట్లుగా అఫీషియల్ ప్రకటన ఇచ్చారు. అయితే పూరీ జగన్నాథ్ ఛార్మీలు డబుల్ ఇస్మార్ట్ ప్రీ ప్రొడక్షన్ లో చాలా బిజీగా వున్నారు. అందుకే వారిద్దరూ ముంబై - హైదరాబాద్ అంటూ తిరుగుతున్నారు. నిన్న కూడా వారిద్దరూ హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో ముంబై వెళుతూ కనిపించారు. లైగర్ సినిమాని ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించడంలో ముంబైలోనే ఆఫీస్ తీసుకుని అక్కడే ఉన్నారు. సినిమా రిలీజ్ అయ్యి ప్లాప్ అయ్యాక మళ్ళీ హైదరాబాద్ కి వచ్చేసారు. మళ్ళీ రామ్ తో మూవీ ఓకె అయ్యాక ముంబై వెళ్ళడం స్టార్ట్ చేసారు.
తాజాగా కూడా వారిద్దరూ ఎయిర్ పోర్ట్ లో ఫొటోలకి ఫోజులిచ్చారు. ఇక పూరీ జగన్నాథ్-ఛార్మీ-రామ్ కాంబోలో డబుల్ ఇస్మార్త్ అప్ డేట్ రేపు రాబోతున్నట్టుగా ఇంతకుముందే మేకర్స్ ప్రకటించారు. దానితో రామ్ అభిమానులు ఎగ్జైట్ అవుతున్నారు. అటు రామ్ కూడా బోయపాటి దర్శకత్వంలో నటిస్తున్న స్కంద ప్యాన్ ఇండియా మూవీ షూటింగ్ కంప్లేట్ చేసెయ్యబోతున్నాడు. అంటే రేపు రాబోయే డబుల్ ఇస్మార్ట్ అప్ డేట్ రెగ్యులర్ షూటింగ్ పై అప్ డేట్ ఇవ్వబోతున్నారేమో అని రామ్ ఫాన్స్ ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.