Advertisement
Google Ads BL

Bro మార్కండేయపై మెరుపుదాడి


పవన్ కళ్యాణ్ ఎలా ఉన్నా ఫ్యాన్స్‌కి నచ్చేస్తారేమో కానీ.. విమర్శకులు మాత్రం చీల్చి చెండాడుతారు. సముద్ర ఖని దర్శకత్వంలో పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ కలయికలో తెరకెక్కుతున్న బ్రో ద అవతార్ మూవీ ఈ నెల 28న విడుదల కాబోతుంది. ఇప్పటికే BRO టీజర్ సెన్సేషన్‌ని క్రియేట్ చేసింది. ఇప్పుడు తాజాగా బ్రో ఐటెం సాంగ్ మైడియర్ మార్కండేయ సాంగ్ విడుదల చేశారు. శనివారం ఈ పాట విడుదల కాగా.. పవన్ కళ్యాణ్ ఈ సాంగ్‌లో ఫేస్‌లో మేకప్ లేకుండా, హెయిర్ స్టయిల్‌ని ఎట్టబడితే అట్టా చూపించేశారు.

Advertisement
CJ Advs

డ్రెస్ విషయంలో స్టయిల్‌గా ఉన్నా.. పవన్ కళ్యాణ్ లుక్స్ విషయంలో విమర్శలు మొదలయ్యాయి. అంతేకాకుండా ఈ పాట వినడానికి వెంటనే చార్ట్ బస్టర్ రేంజ్‌లో లేదనే కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు బ్రో పై ఉన్న అంచనాలు ఈ సాంగ్ పెంచకపోగా.. కాస్త తగ్గించిందేమో అనే డౌట్ స్టార్ట్ అయ్యింది. అసలు ఈ చిత్రానికి ఐటెం సాంగ్ అక్కర్లేదు. కానీ పవన్ కళ్యాణ్ ఉన్నారు కాబట్టి సముద్రఖని-త్రివిక్రమ్ ఇలా ప్లాన్ చేశారు. పవన్ కళ్యాణ్ ఉండేది కొంతసేపే.. ఇలాంటి సాంగ్స్ వదిలి సినిమాపై అంచనాలు తగ్గిస్తే కష్టం అంటున్నారు ఫ్యాన్స్.

థమన్ కూడా క్యాచీ ట్యూన్స్ ఇవ్వలేదు అంటూ పవన్ ఫాన్స్ డిజప్పాయింట్ అవుతున్నారు. అలాగే ఈ పాటకి ఊర్వశి గ్లామర్ కూడా ఊపు తీసుకురాలేదు. ఎందుకంటే సేమ్ అవతార్‌లో ఇప్పటికే ఉర్వశిని వాల్తేర్ వీరయ్య-ఏజెంట్ మూవీస్‌లో చూసేశారు. మళ్ళీ ఆమెని రొటీన్‌ చూపిస్తే.. బోర్ కదా భయ్యా అంటూ కొంతమంది పెదవి విరుపులు మొదలు పెట్టారు. ప్రస్తుతం ఈ పాట విషయంలో థమన్‌పై బాగానే ట్రోలింగ్ జరుగుతోంది.

Fans Unhappy with Bro My Dear Markandeya Song:

Trolling on Thaman with Bro My Dear Markandeya Song
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs