Advertisement
Google Ads BL

అమీర్ ఖాన్ విడాకులతో డిప్రెషన్‌లో డాటర్


అమీర్ ఖాన్ లైఫ్‌లో రెండు పెళ్లిళ్లు. ఇద్దరు భార్యలు, ఇద్దరితో రెండుసార్లు విడాకులు తీసుకున్నారాయన. మొదటిసారి రీనా దత్తాని వివాహం చేసుకున్న అమీర్ ఖాన్ 2002లో ఆమెతో విడాకులు తీసుకున్నారు. అప్పటికే ఆయనకి ఇరా ఖాన్ అనే కుమార్తె ఉంది. అమీర్ కూతురు ఇరా ఖాన్ ఈ మధ్యనే జిమ్ ట్రైనర్‌తో ప్రేమలో పడి నిశ్చితార్ధం చేసుకున్న విషయం తెలిసిందే. ఇరా ఖాన్ మానసిక సమస్యలు ఎదుర్కొనేవారికి చేయూతగా అగస్తు సంస్థని స్థాపించింది. అందులో భాగంగా ఆమె కూడా ఒకప్పుడు మానసిక బాధని ఎదుర్కొన్నట్టుగా చెప్పుకొచ్చింది.

Advertisement
CJ Advs

అమీర్ ఖాన్ 2002లో రీనా దత్తకు విడాకులిచ్చి కొన్నాళ్ళకి కిరణ్ రావుని వివాహం చేసుకున్నారు. 15 ఏళ్ళ కాపురంలో పొరపొచ్చాలు రావడంతో ఫ్రెండ్లీగా విడిపోతున్నామంటూ రెండేళ్ల క్రితమే కిరణ్ రావుతో అమీర్ విడిపోయారు. అప్పటికే వారికి ఓ కొడుకు ఉన్నాడు. అయితే ఇరా ఖాన్ తన తల్లి తండ్రులు అమీర్ ఖాన్-రీన్ దత్తా విడిపోయిన సమయంలో మానసిక క్షోభని అనుభవించినట్టుగా చెప్పుకొచ్చింది. 

వారిద్దరూ విడాకులు తీసుకుని విడిపోయినప్పుడు నాకంతగా అనిపించకపోయినా.. లోపల ఏదో బాధ. అది ఎవరికీ చెప్పలేదు. చెబితే బాధపడతారని చెప్పలేదు. దాదాపుగా ఏడాదిన్నర ఒకేరకమయిన డిప్రెషన్‌లో ఉండిపోయాను. నాలుగు రోజులపాటు ఏమి తినలేదు, ఎక్కువ సమయం ఏడుస్తూ ఉండేదాన్ని. పది గంటలు నిద్రపోయేదాన్ని. ఇదే విధంగా ఎనిమిది నెలలపాటు సఫర్ అయ్యాను. కానీ ఈ మానసిక వ్యాధిని గుర్తించడానికి నాకు చాలా టైం పట్టేసింది. నా ఫ్యామిలీలో కొంతమందికి మానసిక రుగ్మతలు ఉన్నాయి. నేను కూడా బయటికి చెప్పుకోలేక మానసిక సంఘర్షణ ఊబిలో కూరుకుపోయాను. 

అపుడే కాదు గత ఏడాది జూలైలో కూడా నేను డిప్రషన్‌లోకి వెళ్ళిపోయాను. మందులు కూడా వేసుకోలేదు. బరువు పెరిగిపోయాను. కానీ తర్వాత డిప్రెషన్ నుండి పోరాడేలా నన్ను నేను సన్నద్ధం చేసుకున్నాను అంటూ ఇరా ఖాన్ తాను మానసికంగా ఎన్ని ప్రోబ్లెంస్ ఫేస్ చేసిందో చెప్పుకొచ్చింది.

Aamir Khan Daughter Ira Khan Reaction on Parents Divorce:

Ira Khan says she got Depression after Parents Divorce
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs