కిచ్చా సుదీప్ తమ బ్యానర్ లో సినిమా చేస్తానని 9 కోట్లు పారితోషకం తీసుకుని ఇప్పటివరకు డేట్స్ ఇవ్వకుండా తమని ఇబ్బంది పెట్టడమే కాకుండా ఇప్పుడు కూడా తమిళ నిర్మాతతో సినిమా మొదలు పెట్టి మమ్మల్ని మోసం చేశాడంటూ కన్నడ ప్రొడ్యూసర్స్ KN కుమార్, సురేష్ అనే వ్యక్తులు ఈ మధ్యన సుదీప్ పై ఆరోపణలు చేస్తూ మీడియాతో మాట్లాడిన విషయం తెలిసిందే. సుదీప్ పై నిర్మాతల మండలిలో కంప్లైంట్ ఇచ్చామని కూడా చెప్పాడు. అయితే ఆ ఆరోపణలపై కిచ్చ సుదీప్ లీగల్ గా స్పందించాడు.. వాళ్లపై అంటే KN కుమార్, సురేష్ లపై పది కోట్ల పరువు నష్టం దావా వేసాడు.
కిచ్చా సుదీప్ లీగల్ గా ప్రొసీడ్ అవడమే కాకుండా KN కుమార్, సురేష్ లు తనకి మూడు రోజుల్లో క్షమాపణలు చెప్పాలని ఆయన ఆ నోటీసులో పేర్కొన్నారు. సుదీప్ లాయర్ ఆ నోటీసులో.. కుమార్, సురేష్ చేసిన ఆరోపణలతో సుదీప్ అతని ఫ్యామిలీ మానసికంగా బాధపడ్డారని, వాళ్ళ ఆరోపణలు ఆయన వ్యక్తిగతంగా కెరీర్ పరంగా డ్యామేజ్ అయ్యేలా ఉన్నాయి అని, తనని అభిమానించే ప్రేక్షకులు ఈ విషయమై చర్చించుకోవడం ఆయన్ని కలిచి వేసింది. కన్నడ ఇండస్ట్రీలో అయన పలువురు నిర్మాతలతో సినిమాలు చెయ్యడానికి ఆసక్తిగా ఉన్నారు.
ఈ ఆరోపణల నేపథ్యంలో ఇప్పుడు కు సుదీప్ తో సినిమాలు చేసేందుకు ఆ నిర్మాతలు భయపడుతున్నారు. సుదీప్ తో సినిమా చేస్తే ఇబ్బందిపడతామేమో అని వారు జంకుతున్నారు. వచ్చిన ఆఫర్స్ కూడా వెనక్కి తీసుకుంటున్నారంటూ ఆ నోటీసులో పేర్కొన్నారు.