Advertisement
Google Ads BL

ఒకే డ్రెస్ లో మాళవిక మోహన్-మృణాల్ ఠాకూర్


ఏ హీరోయిన్ అయినా తాము వేసిన అవుట్ ఫిట్ ఇంకొకరు వేసుకోకూడదని.. తాము ధరించిన దుస్తులు లాంటివి మరొకరు ధరించకూడదు అని.. డిజైనర్లు కోసం తమకొచ్చే దానిలో చాలా ఖర్చు పెడతారు. యూనిక్ గా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తారు. అందుకే ఈవెంట్ కి వెళ్లాలన్నా పెద్ద పెద్ద డిజైనర్లు రెడీ చేసిన అవుట్ ఫిట్ లో అందంగా రెడీ అవుతారు. ఒకవేళ ఓ హీరోయిన్ వేసుకున్న డ్రెస్ అదే సమయంలో క్రేడ్ మరో హీరోయిన్ కూడా వేసుకుంటే జనాలు ట్రోల్ చేస్తారు. ఇప్పుడు ఓ ఇద్దరు హీరోయిన్స్ ఒకే సమయంలో ఒకే మాదిరి డ్రెస్ లో కనిపించడం అందరి దృష్టిని ఆకర్షించింది.

Advertisement
CJ Advs

అదే సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్, ఇంకొకరు మల్లువుడ్ భామ మాళవిక మోహనన్ లు ఒకే రోజు ఒకేలాంటి డ్రెస్ లో సోషల్ మీడియాలో దర్శనమిచ్చారు. అదేలా అంటే మృణాల్ ఠాకూర్ SIIMA అవార్డ్స్ ప్రెస్ మీట్ లో మోడ్రెన్ డ్రెస్ లో కనిపించింది. ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అలాగే మృణాల్ ఠాకూర్ - విజయ్ దేవరకొండ ల కలయికలో మొదలు కాబోతున్న చిత్ర అప్ డేట్ తో మృణాల్ ఠాకూర్ ట్విట్టర్ లో ట్రెండ్ అవుతుంది. మరోపక్క మాళవిక మోహన్ నిన్న చెన్నై లో ఓ ఈవెంట్ లో పాల్గొంది.

ఆ ఈవెంట్ కోసం మాళవిక మోహనన్ వేసిన డ్రెస్ కూడా అచ్చం మృణాల్ ఠాకూర్ ధరించిన డ్రెస్ మాదిరిగానే మోడ్రెన్ గా కనిపించింది. ఒకే కలర్, ఒకే మోడల్, ఒకే రకమయిన చెక్స్, ఒకే రమయిన కటింగ్.. ఇలా అన్నీ ఒకేరకంగా ఉండడంతో.. ఇప్పుడు ఈ ఇద్దరి హెరోయిన్స్ డ్రెస్ లపై నెటిజెన్స్ కామెడీగా స్పందిస్తున్నారు. ఏంటి మృణాల్, మాళవిక ఇద్దరూ కలిసి ఒకేలాంటి డ్రెస్ ని ఒకే డిజైనర్ దగ్గర కొన్నారా.. ఒకవేళ కొంటెకొన్నారు.. ఒకే టైం లో వేసుకుని అది మాకు చూపించాలా అంటూ కామెంట్ చేస్తున్నారు. 

 

Malavika Mohanan-Mrunal Thakur in the same dress:

Malavika Mohanan and Mrunal Thakur Spotted At Same Dress
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs