Advertisement
Google Ads BL

మెగా డాటర్స్ కే ఎందుకిలా జరుగుతుంది?


మెగా ఫ్యామిలీ అమ్మాయిలకి పెళ్లిళ్లు అచ్చిరావా.. ఇప్పుడిదే హాట్ టాపిక్. ఈ తరం అమ్మాయిలనే కాదు.. మెగాస్టార్ చెల్లెళ్ళు కూడా వాళ్ళ పెళ్లిళ్ల విషయంలో చాలానే జరిగాయి. ఇప్పుడు ఈతరంలో అయితే సుశ్మిత, శ్రీజ, నిహారిక ఎక్కువగా పబ్లిక్ లో కనబడుతున్నారు కాబట్టి వీళ్ళ విషయాలు వైరల్ గా మారుతున్నాయి. మొదట్లో మెగాస్టార్ చిరు పెద్ద కుమర్తె సుశ్మితకి ఉదయ్ కిరణ్ కి ఎంగేజ్మెంట్ వరకు వచ్చి ఆగింది అనే న్యూస్ విపరీతంగా సర్కులేట్ అయ్యింది. ఆ తర్వాత సుశ్మిత పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తుంది.

Advertisement
CJ Advs

ఇక చిరు చిన్న కుమార్తె శ్రీజ శిరీష్ భరద్వాజ్ ని పెద్దలని ఎదురించి ప్రేమ పెళ్లి చేసుకుంది. దీనికి మెగా ఫ్యామిలీ ఒప్పుకోలేదు. శిరీష్ తో కలిసి వేరుగా ఉన్న శ్రీజకి ఓ పాప పుట్టాక శిరీష్ కి విడాకులిచ్చి మళ్ళీ తండ్రి చెంతకి చేరింది. అప్పుడు మెగాస్టార్ తన చిన్న కూతురిని అక్కున చేర్చుకోవడమే కాదు.. ఆమెకి మళ్ళీ ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన కళ్యాణ్ దేవ్ ని ఇచ్చి ఇండస్ట్రీ మొత్తాన్ని పిలిచి అంగరంగ వైభవంగా వివాహం చేశారు. ఆ పెళ్లిని కూడా శ్రీజ నిలుపుకోలేకపోయింది. ప్రస్తుతం శ్రీజ ఇద్దరు ఆడపిల్లలతో సింగిల్ లైఫ్ లీడ్ చేస్తుంది.

ఇక ఇప్పుడు నాగబాబు కూతురు నిహారిక కూడా పెద్దలు కుదురిచ్చిన పెళ్లి చేసుకుంది. మెగా ఫ్యామిలీ ముచ్చటపడి అంగరంగ వైభవంగా నిహారిక పెళ్లి జరిపించారు. ఓ రెండేళ్లు నిహారిక భర్త చైతన్యతో సఖ్యతగానే ఉంది. కానీ గత ఆరు నెలలుగా చైతన్య కి దూరంగా మెగా ఫ్యామిలీకి దగ్గరగానే ఉంటుంది. తాజాగా వారి విడాకుల విషయాన్ని పబ్లిక్ గా ప్రకటించారు. అయితే ఇదంతా చూస్తుంటే మెగా డాటర్స్ కి పెళ్లిళ్లు అచ్చిరావా అనే ప్రశ్న అందరిలో మెదులుతుంది. ఆ ఫ్యామిలి ఆడపిల్లలకు ఇలా ఎందుకు జరుగుతుంది.. దానికి కారణం సర్దుకుపోలేని గుణమా.. లేదంటే ఇతర కారణాలు అనేది మెదళ్ళని తొలిచేస్తున్న ప్రశ్నే.

Why does Mega Daughters happen?:

Why are mega daughters getting divorced?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs