జూన్ 16 న విడుదలై ప్రభాస్ ఆదిపురుష్ పై విమర్శలు వెల్లువెత్తాయి. అసలు ఇది రామాయణమేనా.. లేదంటే పిల్ల బొమ్మలాట అనుకున్నారా అంటూ చాలామంది ధ్వజమెత్తారు. ఆదిపురుష్ డైలాగ్స్ పై కూడా తీవ్ర విమర్శలొచ్చాయి. సీత, రావణ, రాముడి పాత్రలపై, వారు చెప్పిన డైలాగ్స్ పై కూడా అనేక విమర్శలు వచ్చాయి. దర్శకుడు ఓమ్ రౌత్, అలాగే ఆదిపురుష్ రచయిత ఇలా అందరిని తిట్టిపోశారు. ఆదిపురుష్ మూవీ విడుదలై థియేటర్స్ లో హడావిడి ముగిసినా ఇంకా ఆదిపురుష్ ని వివాదాలు వదల్లేదు.
తాజాగా ఆదిపురుష్ రైటర్ ప్రేక్షకులకి క్షమాపణలు చెప్పాడు. ఆదిపురుష్ రైటర్ మనోజ్ ముంతసీర్ ఇన్స్టా వేదికగా.. ఆదిపురుష్ డైలాగ్స్ వలన ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని నేను అంగీకరిస్తున్నాను. అందువల్ల నేను నా రెండు చేతులు జోడించి మీ అందరికి బేషరతుగా క్షమాపణలు చెబుతున్నాను. ప్రభు బజరంగ బలి మమ్మల్ని ఐక్యంగా ఉంచి మన సనాతన, పవిత్రమైన గొప్ప దేశానికి సేవ చేందుకు శక్తిని ప్రసాదించుగాక అంటూ పోస్ట్ చేసాడు.
ఆదిపురుష్ హనుమంతుడిపై కూడా విమర్శలోచ్చినా విషయం తెలిసిందే. హనుమంతుడి నోటివెంట అలాంటి మాటలా అంటూ జనాలు విస్తుపోయారు.