Advertisement
Google Ads BL

రాకేష్ మాస్టర్ మూడో భార్యపై మహిళల దాడి


రాకేష్ మాస్టర్ ఈమధ్యనే అకాల మరణం చెందారు. ఆయన మృతి తో శేఖర్ మాస్టర్, సత్య మాస్టర్ లాంటి వారు కన్నీళ్లు పెట్టుకున్నారు. రాకేష్ మాస్టర్ గతంలో గొప్ప పేరున్న డాన్స్ మాస్టర్. కానీ కొన్నాళ్లుగా తాగుడుకు బానిసై ఆయన తన పరువు, పరపతిని పోగొట్టుకున్నారు. అయినప్పటికీ ఆయన మరణించారనే వార్త తెలియగానే చాలామంది డాన్సర్స్ ఆయన ఇంటికి చేరుకొని ఆయన అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఇక రాకేష్ మాస్టర్ వైవాహిక జీవితం వివాదాస్పదం. ఆయన మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. మొదటి భార్యలతో విభేదాలతో విడిపోయిన రాకేష్ మాస్టర్ తర్వాత తన ఇంట్లోకి వంట చెయ్యడానికి వచ్చిన లక్ష్మిని తన మూడో భార్యగా పలు యూట్యూబ్ ఛానల్స్ కి పరిచయం చేసాడు.

Advertisement
CJ Advs

అయితే రాకేష్ మాస్టర్ చనిపోయే ముందు అంటే ఓ రెండు మూడు నెలల ముందే ఆమె రాకేష్ మాస్టర్ తో విడిపోయి.. వేరే ఇంట్లో ఉంటుంది. రాకేష్ మాస్టర్ చనిపోయినప్పుడు కూడా ఆమె రాలేదు. తర్వాత ఆమె మాస్టర్ ని చంపించింది అంటూ చాలామంది ఆరోపించారు. తనకి ఆరోగ్యం బాలేదు.. రాకేష్ మాస్టర్ చనిపోయేందుకు తానేమి చెయ్యలేదు అంటూ ఓ వీడియో కూడా విడుదల చేసింది. అయితే లక్ష్మి రీసెంట్ గా తన స్కూటీపై వెళుతుండగా.. ఆమెపై లిల్లీ అనే యూట్యూబర్ మరికొంతమంది మహిళలతో కలిసి లక్ష్మిపై దాడి చేసి గాయపరచడం హాట్ టాపిక్ అయ్యింది.

లక్ష్మిని పంజాగుట్టలో నడి రోడ్డుపైనే జుట్టు పట్టుకుని కొట్టడంతో ఆమె పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసింది. అయితే ఆ లిల్లీ అనే మహిళ లక్ష్మితో తనకి గొడవలేమి లేవు.. కానీ లక్ష్మి తనని  ముందుగా దూషించడంతోనే తాము అలా చేశామని.. తన కూతురుని లక్ష్మి బూతులు తిడుతూ మానసికంగా ఇబ్బంది పెట్టడంతోనే తాను ఆలా చేశానంటూ ఆమె తన వెర్షన్ ని పోలీసులకి వినిపించింది. ప్రస్తుతం లిల్లీ ఇంకా కొంతమంది మహిళలు లక్ష్మి పై దాడి చేసిన క్లిప్స్ సోషల్ మీడియాలో వైరలయ్యాయి.               

Rakesh Master third wife Lakshmi attacked by some youtubers:

Rakesh Master claimed third wife, Lakshmi, attacked in public
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs