హీరో విజయ్ అభిమానులు తనని బెదిరిస్తున్నారంటూ తమినాడులోని చెన్నై కి చెందిన ఆల్ పీపుల్స్ పొలిటికల్ పార్టీ నేత రాజేశ్వరి ప్రియా కేసు పెట్టి, మీడియా మీట్ పెట్టడం కోలీవుడ్లో సంచలనంగా మారింది. అసలు విజయ్ అభిమానులు ఆమెని ఎందుకు బెదిరిస్తున్నారు అంటే.. హీరో విజయ్ - లోకేష్ కనగరాజ్ ల కలయికలో తెరకెక్కుతున్న LEO మూవీ నా రెడీ సాంగ్ లో విజయ్ స్మోకింగ్ చెయ్యడం, ఆ సాంగ్ లో మత్తు పదార్ధాలను చూపించడమే కాకుండా, రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తున్నారంటూ కొంతమంది కేసు పెట్టి కోర్టుకి వెళ్లిన విషయం తెలిసిందే. ఆ కేసు పెట్టిన వారిలో రాజేశ్వరి ప్రియా ఉన్నారు.
రాజేశ్వరి ప్రియా ఈ పాట విడుదలయ్యాక పలుమార్లు ప్రెస్ మీట్ పెట్టి విజయ్ ని విమర్శించారు. దానితో హీరో విజయ్ అభిమానులు ఆమెని సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేస్తూ వేధిస్తున్నారంటూ ఆమె చెన్నై లోని డీజీపీ కార్యాలయానికి వెళ్లి విజయ్ ఫాన్స్ మీద కంప్లైంట్ ఇచ్చారు. తాను స్మోకింగ్ వీడియోపై నిరసనలు తెలిపినందుకే విజయ్ ఫాన్స్ తనని వేధిస్తున్నారంటూ ఆమె ఫిర్యాదులో పేర్కొంది. తనని అసభ్యకరంగా మాట్లాడుతూ ఇబ్బంది పెడుతున్నారంటూ ఆమె తెలిపారు.
ఒక మహిళ పట్ల అలా ఎలా అసభ్యకరంగా మాట్లాడతారు. అలా మాట్లాడేందుకు తన అభిమానులని ప్రేరేపించిన విజయ్ ని వెంటనే అరెస్ట్ చెయ్యాలంటూ ఆమె డిమాండ్ చేసారు. అయితే ఆమెని.. విజయ్ మాత్రమే లేకుండా ఇంకా చాలామంది హీరోల సినిమాల్లో స్మోక్ చేసిన సీన్స్ ఉన్నాయి కదా అని అడిగితే.. దానికి ఆమె గతంలో తాను సూపర్ స్టార్ రజినీకాంత్ పై ఇలాంటి నిరసనే తెలిపినట్లుగా చెప్పింది.