Advertisement
Google Ads BL

జవాన్ నాన్ థియేట్రికల్ రైట్స్ కి రికార్డ్ ధర


బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ లేటెస్ట్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ జవాన్. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 7న హిందీ, తెలుగు, త‌మిళ భాష‌ల్లో భారీ ఎత్తున రిలీజ్ చేయ‌టానికి మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు. అలాగే  ‘జవాన్’ ట్రైలర్‌ను మిషన్ ఇంపాజిబుల్ సినిమా థియేటర్స్‌లో ప్ర‌ద‌ర్శించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఇది వరకే మ్యూజిక్ రైట్స్ విషయంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన జవాన్.. తాజాగా మరో రికార్డ్ క్రియేట్ చేసింది.  ట్రైల‌ర్ ఇంకా రిలీజ్ కాక‌ముందే ఈ సినిమా థియేట్రికల్ హక్కులు రూ.250 కోట్లకు అమ్ముడు కావటం విశేషం. యాక్ష‌న్ ఎలిమెంట్స్, న‌టీన‌టుల అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో కూడిన జ‌వాన్ ట్రైల‌ర్ కోసం ఆడియెన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

Advertisement
CJ Advs

సాధార‌ణంగానే షారూక్ ఖాన్ సినిమాల‌కు సంబంధించిన హ‌క్కులన్నీ ఫ్యాన్సీ రేట్ల‌కే అమ్ముడ‌వుతుంటాయి. అయితే తాజాగా ఆయ‌న గ‌త సినిమాల రికార్డుల‌ను ఆయ‌న తాజా చిత్రాలు దాటేస్తున్నాయి.

ఆయ‌న గ‌త చిత్రం ప‌ఠాన్ బాక్సాఫీస్ రికార్డుల‌ను కొల్ల‌గొట్టింది. ఇప్పుడు జ‌వాన్‌పై భారీ క్రేజ్ క్రియేట్ అయ్యింది. దీంతో ఈ సినిమా థియేట్రిక‌ల్ హ‌క్కుల కోసం అంద‌రూ పోటీ ప‌డుతున్నారు. ఇక నాన్ థియేట్రిక‌ల్ హ‌క్కులు హాట్ కేకులా అమ్ముడ‌వటం చూస్తుంటే షారూక్ ఖాన్‌కి ఉన్న క్రేజ్ ఎంట‌నేది స్ప‌ష్ట‌మైంది.

షారూక్ ఖాన్ హీరోగా న‌టించిన ఈ చిత్రాన్ని యంగ్ డైరెక్ట‌ర్ అట్లీ తెర‌కెక్కిస్తున్నారు. రెడ్ చిల్లీస్ ఎంట‌ర్టైన్మెంట్, గౌరీ ఖాన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

SRK Jawan Non Theatrical Rights Sold out:

Shah Rukh Khan Jawan Non Theatrical Rights Sold for 250 Crore
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs