పవన్ కళ్యాణ్ పై తప్పుడురాతలు రాసినవారిపై యాక్షన్ కి రంగం సిద్ధమైంది. కొద్దిరోజులుగా పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లపై బహిరంగంగా మాట్లాడమే కాకూండా ఆయన మూడో భార్య అన్నా లేజ్నోవా తో విడిపోయారంటూ కొంతమంది పనిగట్టుకుని ప్రచారం చేశారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ని అవమానపరిచేలా ఆయన వ్యక్తిగత జీవితంపై తప్పుడు ప్రచారం చేసిన కొన్ని యూట్యూబ్ ఛానల్స్, కొన్ని వెబ్ సైట్స్ పై జనసేన పార్టీ యాక్షన్ తీసుకోవడానికి రెడీ అయ్యింది. అంతేకాకుండా ఇదంతా వైసీపీ అనుకూల మీడియానే చేస్తుంది అని జనసేన పార్టీ ఆరోపిస్తుంది.
జనసేన అధినేత శ్రీ @PawanKalyan గారి వ్యక్తిగత జీవితంపై తప్పుడు కథనాలు, అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై @JanaSenaParty చట్టపరంగా తీవ్రమైన చర్యలు తీసుకోనుంది. వీరిలో అధికార @YSRCParty కి చెందిన నాయకులు, కార్యకర్తలతో పాటుగా, వారి అనుబంధ యూట్యూబ్ ఛానెల్స్, పలు మీడియా సంస్థలపై చర్యలు తీసుకోనున్నాము... అంటూ జనసేన ట్విట్టర్ హ్యాండిల్ లో అయా వెబ్ సైట్స్ పేర్లు, యూట్యూబ్ ఛానల్స్ పేర్లు, కొంతమంది YCP నేతల పేర్లని బయటపెట్టారు.
వీరిపై చట్టపరమైన చర్యలకి జనసేన సిద్ధమైంది. పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా లేజ్నోవాతో కలిసే ఉన్నట్లుగా ఈమధ్యనే వారు పూజలో పాల్గొన్న ఫొటోస్ ని జనసేన పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్ నుండి రిలీజ్ చేసి పుకార్లకు చెక్ పెట్టగా.. ఇప్పుడు పవన్ పై తప్పుడు రాతలు రాసినవారిపై చట్టపరమైన చర్యలకు జనసేన పార్టీ సిద్ధమైంది.