వరస ఫెయిల్యూర్స్ తో సతమతమవుతున్న కుర్ర హీరో నాగ శౌర్య ఈసారి కొత్త దర్శకుడు పవన్ బాసంశెట్టి దర్శకత్వంలో రంగబలి అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేసాడు. షూటింగ్ సమయంలో కానీ, పోస్ట్ ప్రొడక్షన్ సమయంలో కానీ రంగబలి పై ఎలాంటి ఇంట్రెస్ట్ కనిపించలేదు. కానీ రంగబలి సాంగ్స్, ట్రైలర్ వదిలాక సినిమాపై ఆడియన్స్ లో అంచనాలు మొదలయ్యాయి. నాగ శౌర్య అండ్ టీం చేసిన ప్రమోషన్స్ మరింత ఆసక్తిని రేకెత్తించాయి. జులై 7న ఏడెనిమిది సినిమాలతో పోటీ పడి మరీ ఆడియన్స్ ముందుకు వచ్చిన రంగబలి మేకర్స్ తమ సినిమాపై ఉన్న నమ్మకంతో విడుదలకు ఒకరోజు ముందే ప్రీమియర్స్ తో హడావిడి చేసారు.
గురువారం రాత్రి AAA లో ప్రెస్ ప్రీమియర్స్ పడ్డాయి. మరి రంగబలి ప్రీమియర్స్ షో చూసినవాళ్లు తమ ఒపీనియన్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. రంగబలిలో సత్య చేసే కామెడీ, వన్ లైన్ డైలాగులు బాగా వర్కౌట్ అయ్యాయి. కానీ ఫస్టాఫ్ బిలో ఏవరేజ్‌గా ఉంది. ఇప్పటి వరకూ వచ్చిన అంశాలు ఎంగేజింగ్‌గా లేవు అని ఒకరంటే.. రంగబలి సినిమా ప్రమోషన్స్ మీద పెట్టిన ధ్యాస.. కాస్త సినిమా మీద పెట్టి ఉంటే రిజల్ట్ వేరే విధంగా ఉండేది. కమెడియన్ సత్యనే వన్ మ్యాన్ షో చేశాడు.. అంటూ మరొకరి స్పందన కనిపిస్తుంది.
నాగ శౌర్య నటన పరంగా ఓకె. కానీ ఇక్కడ నాగ శౌర్య కన్నా సత్య కామెడికే నా ఓటు అంటూ మరో నెటిజెన్ కామెంట్ చేసాడు. రంగబలి మూవీ ఔట్‌డేటెడ్ కమర్షియల్ ఎంటర్‌టైనర్. ఇది పెద్దగా ఎంగేజ్ చేయకపోగా.. ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఇవ్వదు. సత్య వల్ల వచ్చే కామెడీ సీన్స్ తప్ప ఈ మూవీలో ఏమీ లేదు. కామెడీ కి ఓటేసేవారు మాత్రమే రంగబలిని చూడొచ్చు అంటూ మరొకరు కామెంట్ చేస్తున్నారు. మరి నాగ శౌర్య రంగబలి ఫైనల్ రిపోర్ట్ రివ్యూలో చూద్దాం.