నేషనల్ క్రష్ రష్మిక మందన్న సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది. అప్పుడప్పుడు అందమైన ఫొటోస్ షేర్ చేస్తూ ఉంటుంది. ఈ మధ్యనే ఫుడ్ విషయంలో తానెలా మోసం చేస్తుందో సరదాగా చెప్పిన రష్మిక.. హీరో విజయ్ దేవరకొండ ఫ్రెండ్ షిప్ వలన తరుచూ ట్రెండ్ అవుతూ ఉంటుంది. టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండతో కన్నడ బ్యూటీ రష్మిక చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంది అనే న్యూస్ ఎప్పటినుండో ప్రచారం లో ఉంది. కానీ రష్మిక-విజయ్ ఇద్దరూ మేము ఫ్రెండ్స్ అంటూ చెబుతారు. రీసెంట్ గా విజయ్-రష్మిక ఫామిలీస్ కలిసి లంచ్ కి ఓ రెస్టారెంట్ కి వెళ్లారు. అది కాస్తా మీడియాలో వైరల్ అయ్యాయంది.
ఇక ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీగా మారిన ఈ లక్కీ గర్ల్ రష్మిక తెలుగులో పుష్ప ద రూల్ షూటింగ్ తో పాటుగా.. నితిన్ తో చేస్తున్న కొత్త సినిమా షూటింగ్ లో జాయిన్ అవ్వబోతుంది. అలాగే తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న రెయిన్ బో షూట్ లో కూడా పాల్గొంటుంది. ఇక హిందీలో యానిమల్ షూట్ కంప్లీట్ చేసి ఎమోషనల్ గా ఓ నోట్ ని షేర్ చేసిన రష్మిక మందన్న తాజాగా తన క్యూట్ పిక్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది.
క్లోజప్ లో రశ్మిక్ ఫేస్ చాలా బ్రైట్ గా కనిపించగా.. చాలా ముద్దుగా.. అందంగా ఉంది అంటూ ఆమె అభిమానులు కామెంట్ చేస్తున్నారు. Looking very cute...😘❤️ @iamRashmika, My lovely Beautiful Baby ❤️ 😍 #Rashmika, Wow lovely 🥰 అంటూ కామెంట్స్ చేస్తున్నారు.