Advertisement
Google Ads BL

తల్లయిన కళ్యాణ్ రామ్ హీరోయిన్


టాలీవుడ్లో కళ్యాణ్ రామ్ కత్తి చిత్రంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సనా ఖాన్ ఆ తర్వాత మంచు మనోజ్ తో కలిసి నటించింది. మంచు మనోజ్ తో  మిస్టర్ నూకయ్యలో నటించినా సనా ఖాన్ ని ఆ చిత్రమూ నిరాశపరిచింది. ఆ తర్వాత కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో నటించింది. కానీ సనా ఖాన్ కి ఆ భాషలు కూడా సక్సెస్ ఇవ్వలేదు. హీరోయిన్ గా అవకాశాలు పూర్తిగా సన్నగిల్లడంతో సన ఖాన్ కొన్నాళ్ళు ఖాళీగానే కనిపించింది. ఇక 2020 లో వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని డిసైడ్ అయ్యింది.

Advertisement
CJ Advs

2020 లో అనాస్ సయ్యద్ ను ఆమె వివాహం చేసుకుని సినిమాలకు, నటనకు పూర్తిగా దూరమయ్యింది. గత మూడేళ్ళుగా వివాహ బంధంలో సంతోషంగా ఉన్న సనా ఖాన్ తాజాగా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తాను తల్లి అయిన విషయాన్ని ఆమె ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చింది. తమపై ప్రేమాభిమానాలు చూపుతున్న అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పింది. అభిమానులు, అందరి దీవెనలు తమ బిడ్డపై కూడా ఉండాలని ఈ ట్వీట్ లో కోరుకుంది.

Sana Khan, Anas Saiyad welcome their first child:

Sana Khan and Anas Saiyad blessed with a baby boy
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs