నటి పూర్ణ గత ఏడాది వివాహం చేసుకుంది. దుబాయ్ కి చెందిన బిజినెస్ మ్యాన్ ని సీక్రెట్ గా వివాహం చేసుకుని పెళ్లి ఫొటోస్ ని బయటపెట్టింది. పెళ్లికి పూర్ణ వేసుకున్న నగలు, అందుకున్న కానుకలు అన్నీ అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పెళ్లి చేసుకుని ఆ వెంటనే ఆమె మళ్ళీ నటన వైపు వచ్చేసింది. బుల్లితెర మీద, వెండితెర మీద కూడా పూర్ణ హడావిడి చేసింది. అయితే ఈ ఏడాది పూర్ణ పండంటి బిడ్డకి జన్మనిచ్చింది. తనకు బేబీ పుట్టిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది.
అయితే బిడ్డ పుట్టిన కొద్ది నెలల్లోనే పూర్ణ మళ్ళీ బుల్లితెర ఢీ డాన్స్ షో కి జెడ్జ్ గా కనిపించింది. కేవలం మూడు నెలలు మాత్రమే పూర్ణ కనిపించలేదు. అలా మాయమై మళ్ళీ ఈటివి ఢీ డాన్స్ షో లో ఇలా ప్రత్యక్షమయ్యింది. శేఖర్ మాస్టర్ తో కలిసి పూర్ణ ఢీ15 డాన్స్ షో లో జెడ్జ్ గా కూర్చోవడమే కాదు.. స్టేజ్ మీద శేఖర్ మాస్టర్ తో కలిసి హుషారుగా డాన్స్ కూడా చేస్తుంది. బిడ్డ పుట్టిన కొద్దిరోజులకే పూర్ణ తనకి నటన మీదున్న ఇష్టంతోనే ఇంత త్వరగా మళ్ళీ షూటింగ్స్ కి హాజరవుతోంది.
సిల్వర్ స్క్రీన్ మీద హీరోయిన్ పాత్రలు తగ్గడంతో కేరెక్టర్ ఆర్టిస్ట్ గా సత్తా చాటుతోంది. అటు ఫ్యామిలీ ఇటు షూటింగ్స్ అంటూ పూర్ణ అన్నీ బాగానే మ్యానేజ్ చేసుకుంటుంది.