Advertisement
Google Ads BL

అంత బిల్డప్ ఇచ్చారు.. తుస్సుమనిపించారు


రేపు జులై 7 న విడుదల కాబోతున్న సినిమాలన్నిటిలో ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తున్న చిత్రం యంగ్ హీరో నాగ శౌర్య నటించిన రంగబలే. కొన్నాళ్లుగా సక్సెస్ కోసం తపనపడుతున్న నాగ శౌర్య ఈసారి రంగబలితో హిట్ కొట్టాలనే కసితో సినిమా ప్రమోషన్స్ చేస్తున్నాడు. అందుకే ఇండస్ట్రీలో కాస్త ఫేమస్ అయిన ఇంటర్వ్యూ చేసేవారిని, లైక్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ లాంటి గెటప్, అలాగే కొంతమంది జర్నలిస్ట్ ల యాటిట్యూడ్ లని ఇమిటేట్ చేస్తూ కమెడియన్ సత్యతో హీరో నాగ శౌర్య చేత ఇంటర్వూస్ ఇప్పించడం, సత్య ఆయా గెటప్స్ తో ఇప్పించిన ఇంటర్వూస్ ప్రోమో వదిలి తెగ హైప్ క్రియేట్ చేసారు.

Advertisement
CJ Advs

సత్య-నాగ శౌర్య ఇంటర్వూ చూసేందుకు అందరూ ఆసక్తి కనబర్చారు. మరి రంగబలి టీం అంతలాంటి బిల్డప్ క్రియేట్ చేసింది. అయితే ఆ బిల్డప్ మొత్తం ఆ ఇంటర్వ్యూ బయటికొచ్చాక తుస్సుమంది. ఓపెన్ హార్ట్ విత్ RK ఇంటర్వ్యూ టైప్ లో సత్య రాధాకృష్ణ గెటప్ వేసి నాగ శౌర్యని ఇంటర్వ్యూ చేసాడు. అదంతేమి ఇంట్రెస్టింగ్ గా లేదు. ఇక దేవి నాగ వల్లి గతంలో టీవీ 9 ఆఫీస్ లో హీరో విశ్వక్ సేన్ తో గెటౌట్ మై ఆఫీస్ అంటూ చేసిన కామెంట్స్ ఇమిటేట్ చేస్తూ సత్య దేవి నాగవల్లి గెటప్ వేసాడు. అలాగే సురేష్ కొండేటి హీరోలని, దర్శకనిర్మాతల్ని కొన్ని ప్రశ్నలు వేస్తూ హైలెట్ అయినట్లుగా సత్య సురేష్ కొండేటిలా మారిపోయి జర్నలిస్ట్ గా నాగ శౌర్య ని ప్రశ్నలు వేసాడు.

అలా సత్య-నాగ సౌర్య ల ఇంటర్వూ ముందులో పెంచిన హైప్ ని ఏమాత్రం రీచ్ అవ్వలేదు. కొద్దిగా ఫన్ తప్ప ఆ ఇంటర్వ్యూ అంతగా ఇంప్రెస్స్ కలిగించలేదు. కావాల్సిన క్రియేటివిటీని చిత్ర బృందం చూపించలేకపోయింది. ఎంతో ఆసక్తిగా వీడియో కోసం ఎదురు  చూసిన ప్రేక్షకులంతా ఇప్పుడు నిట్టూరుస్తున్నారు.

They gave so much build up.. finally made me pee:

Rangabali: Satya-Naga Shaurya interview highlights
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs