Advertisement
Google Ads BL

ఢీ స్టేజ్ పై కన్నీటి పర్యంతమైన శేఖర్ మాస్టర్


ఢీ స్టేజ్ మీద ఫేమస్ అయ్యి టాలీవుడ్ టాప్ హీరోలకి డాన్స్ మాస్టర్ గా టర్న్ అయిన శేఖర్ మాస్టర్ ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో మంచి పొజిషన్ ని లీడ్ చేస్తున్నారు. ఢీ డాన్స్ షో కి జెడ్జ్ గా వస్తూనే పలు ఛానల్స్ లోను కామెడీ ప్రోగ్రామ్స్ కి జెడ్జ్ గా మారిన శేఖర్ మాస్టర్ మెగాస్టార్ చిరు దగ్గర నుండి జూనియర్ ఎన్టీఆర్ వరకు చాలామందికి కొరియోగ్రఫీ చేస్తున్నారు. అలాంటి శేఖర్ మాస్టర్ పై గురువు రాకేష్ మాస్టర్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. పలు సందర్భాల్లో రాకేష్ మాస్టర్.. శేఖర్ మోసం చేసాడు, వాడు మోసగాడు అంటూ మాట్లాడిన మాటలు శేఖర్ మాస్టర్ ని బాధపెట్టాయి.

Advertisement
CJ Advs

తాజాగా రాకేష్ మాస్టర్ మరణించడంతో దగ్గరుండి అంత్యక్రియలు చేసి మరీ సత్య మాస్టర్ తో కలిసి పెద్ద కర్మని నిర్వహించిన శేఖర్ మాస్టర్ అక్కడే చెప్పాడు.. మాస్టర్ కి మాకు చిన్న చిన్న గొడవలు తప్ప మరేదీ లేదు. అది నాకు ఆయనకి మధ్యన ఉన్న చిన్న సమస్య. కానీ అదేదో నేను మోసం చేసినట్లుగా యూట్యూబ్ ఛానల్స్ లో తంబలైన్ పెట్టి రాస్తున్నారు.. అని బాధపడ్డాడు. తాజాగా ఢీ డాన్స్ షో లో రాకేష్ మాస్టర్ చనిపోయిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. స్క్రీన్ మీద రాకేష్ మాస్టర్ మొదట్లో మాట్లాడిన వీడియో ప్లే చేసారు. అందులో ఢీ షోలోకొచ్చినప్పుడు నాకు పెళ్లి కాలేదు కానీ నాకో కొడుకు ఉన్నాడు. వాడే శేఖర్ అని రాకేష్ మాస్టర్ చెప్పిన మాటలను చూపించగానే శేఖర్ మాస్టర్ కన్నీటి పర్యంతమయ్యాడు.

నాది గురువు గారిది తండ్రీకొడుకుల బంధం. ఆయనకి.. నాకు తెలిసి తాగే అలవాటూ లేదు. కొంతమంది ఆయన చుట్టూ చేరి ఆయన్ని తాగుడుకు బానిసని చేసారు. మా మధ్యన ఏవో చిన్న సమస్యలు ఉన్నాయి అంతే. నేను మాస్టర్ ని ఎక్కడా ద్వేషించలేదు. కానీ కొంతమంది పనిగట్టుకుని నేను మాస్టర్ ని మోసం చేసానని రాస్తున్నారు, ఇది ఎంతవరకు న్యాయం అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. నిన్న బుధవారం ఎపిసోడ్ లో శేఖర్ కన్నీళ్లు పెట్టుకున్నది ప్రసారమయ్యింది.

Sekhar Master Crying At Dhee Dance stage:

Sekhar Master Most Emotional Moment
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs