సమంత సినిమాలకి గ్యాప్ ఇవ్వబోతుందా.. అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. సమంత ఖుషి, సిటాడెల్ షూటింగ్స్ ఫినిష్ కాగానే సమంత ఓ ఏడాది పాటు షూటింగ్స్ కి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అందుకే సమంత ఎలాంటి కొత్త ప్రాజెక్ట్స్ ఒప్పుకోవడం లేదట. ఆ రెండు షూటింగ్ పూర్తయ్యాక సమంత లాంగ్ బ్రేక్ తీసుకోవాలని.. ఈ గ్యాప్ లో ఆమె హెల్త్ పరంగాను, పర్సనల్ లైఫ్ పై ఫోకస్ పెట్టాలని డిసైడ్ అయినట్లుగా తెలుస్తుంది.
ఈ ఏడాది పాటు ఆమె ఎలాంటి కథలు వినడం కానీ, కొత్త ప్రాజెక్ట్స్ ఓకె చెయ్యడం కానీ చెయ్యకూడదని నిర్ణయించుకుందట. ఖుషి షూటింగ్ పూర్తయ్యాక ఆమె ఖుషి ప్రమోషన్స్ లో పాల్గొంటుంది, సిటాడెల్ షూటింగ్ పూర్తయినా.. ప్రమోషన్స్ అప్పుడే మొదలు పెట్టరు గనక సమంత ఖుషి తర్వాత బయట కనబడే ఛాన్స్ ఉండదు అని.. ఓ ఏడాది పాటు ఆమెని ఫ్యాన్స్ మిస్ అవడం ఖాయమనే మాట వినిపిస్తుంది.
అయితే సమంత డెసిషన్ పై ఫాన్స్ ఆందోళన పడుతున్నారు. సమంత హెల్దీగా ఉండాలి.. కానీ దాని కోసం సినిమాలకి బ్రేక్ ఇవ్వడం ఎంత వరకు కరెక్ట్ అనే మాటలు వినిపిస్తున్నాయి. కొంతమంది మాత్రం హెల్త్ ఇంపార్టెంట్.. ముందు అది చూసుకో సామ్.. తర్వాత పని మీద దృష్టి పెడుదువు అనే సలహాలు ఇస్తున్నారు.